Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం విదితమే. నిన్నటి నుంచి ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూట్వీట్ చేస్తున్నారు. ఇక దీంతో ప్రస్తుతం అందరి చూపు సామ్ మాజీ భర్త, హీరో నాగ చైతన్య మీదనే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ళ తరువాత విడాకులు తీసుకొని విడిపోయారు, విడిపోయేముందు తాము ఎప్పటికి స్నేహితులమే అని చెప్పుకొచ్చారు. మరి సామ్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చైతూ స్పందిస్తాడా..? అనేది ప్రస్తుతం అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఇప్పటికే సామ్ మరిది, అక్కినేని అఖిల్, సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేసి శభాష్ అనిపించుకున్నాడు.
ఎన్ని విభేదాలు ఉన్నా సామ్ ఆరోగ్యం బావుండాలని కోరుకొంటునట్లు తెలిపి అఖిల్ అభిమానుల మనస్సులో ఒక మెట్టు ఎక్కేశాడు. ఇక చైతూ కూడా ఒక ట్వీట్ వేస్తే బావుంటుందని అక్కినేని అభిమానులు చెప్పుకొస్తున్నారు. వారి మధ్య ఎన్ని గొడవలు అయినా జరిగి ఉండొచ్చు. కానీ, ఇద్దరు ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత గా ప్రేమించుకున్నారు. అలాంటిది సామ్ కు ఇలా జరిగినప్పుడు కనీసం కన్సర్న్ చూపించడం మంచితనమని, ఎన్నో ఇంటర్వ్యూలో సామ్ తనకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ అని చెప్పి తన వ్యక్తిత్వాన్ని నిరూపించిన చై.. ఇప్పుడు కూడా తన మాజీ భార్యపై తనకున్న ఇష్టాన్ని తెలిపితే బావుంటుంది అంటున్నారు. మరి చై ఏమైనా స్పందిస్తాడా..? లేదా..? అనేది చూడాలి.
