Site icon NTV Telugu

Naga Chaithanya : ఇద్దరు పిల్లలు కావాలి.. ఇష్టాలను బయటపెట్టిన నాగచైతన్య

Nagachaithanya Shobotha

Nagachaithanya Shobotha

Naga Chaithanya : నాగచైతన్య, శోభిత మ్యారేజ్ లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు కెరీర్ లోనూ నాగచైతన్య జోష్‌ మీద సాగుతున్నాడు. రీసెంట్ గానే తండేల్ తో మంచి హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత కార్తీక్ దండుతో థ్రిల్లర్ మిస్టరీ మూవీ చేయబోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ.. పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యాడు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నా. ఈ గ్యాప్ లో శోభితకు టైమ్ ఇవ్వలేకపోతున్నాను. తనతో గడపాలని ఉంది. అందుకే టైమ్ దొరికితే ఆమెతోనే ఉంటున్నా. మా ఇద్దరి మధ్య గ్యాప్ రావొద్దని కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. ఆమెకు రేసింగ్ ట్రాక్ మీద డ్రైవింగ్ నేర్పించా. నాతో పాటు డ్రైవింగ్ కు వస్తోంది.

Read Also : Kingdom : కింగ్ డమ్ పై రష్మిక పోస్ట్.. ముద్దుపేరు చెప్పిన విజయ్..

నాకు పెద్దగా కోరికలు లేవు. నాకు 50 ఏళ్లు వచ్చేసరికి ఇద్దరు పిల్లలతో ఆడుకోవాలని ఉంది. కొడుకు పుడితే రేసింగ్ నేర్పిస్తా. కూతురు పుడితే ఆమెకు ఏది నచ్చితే అది చేయిస్తా. కుటుంబంతో హ్యాపీగా గడుపుతా. ఇంతకు మించి పెద్దగా కోరికలు ఏమీ లేవు. ప్రస్తుతానికి మంచి సినిమాలు లైన్ లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నా. ఇక మీదట రొటీన్ లవ్ స్టోరీలు కాకుండా డిఫరెంట్ కథలతోనే సినిమాలు చేయాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నాయి.

Read Also : Vijay Devarakonda : మళ్ళీ అవే కామెంట్లు.. విజయ్ అవసరమా..?

Exit mobile version