Site icon NTV Telugu

Naga Chaitanya: ప్రేక్షకుల్ని వణికించిన డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టిన చైతూ

Naga Chaitanya (13)

Naga Chaitanya (13)

Naga Chaitanya Next with Karthik Dandu after Thandel: బంగార్రాజు సినిమాతో ఓ మాదిరి హిట్ అందుకున్న నాగచైతన్య ఆ తర్వాత సరైన హిట్ సినిమా కోసం పరితపిస్తున్నాడు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. చేపల వేట కోసం గుజరాత్ తీరం నుంచి సముద్రంలోకి వెళ్లిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు అనూహ్యంగా పాకిస్తాన్ నేవీ చేతిలో చిక్కుతారు. అక్కడ జైలు శిక్ష అనుభవించి తిరిగి భారతదేశానికి తిరిగి వస్తారు. ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య మరో డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

RC 17: పుట్టిన రోజుకు ముందే పండుగ మొదలెట్టండి.. రికార్డుల వేటకు రంగస్థలం కాంబో రిపీట్!

ఆ డైరెక్టర్ ఇంకెవరో కాదు, విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులందరినీ ఒక రేంజ్ లో వణికించిన డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు. సుకుమార్ శిష్యుడిగా పేరు తెచ్చుకున్న కార్తీక్ వర్మ విరూపాక్ష సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా సంయుక్త హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆయన మరో డిఫరెంట్ సబ్జెక్టుతో నాగ చైతన్యని ఇంప్రెస్ చేశాడని కథ బాగా నచ్చడంతో నాగచైతన్య కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. విరూపాక్ష సినిమా నిర్మాతగా వ్యవహరించిన బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ నాగచైతన్య కార్తీక్ వర్మ సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రసాద్ నిర్మాతగా సిద్దు జొన్నలగడ్డ జాక్ సినిమా తెరకెక్కుతోంది. తమిళంలో సైతం ప్రసాద్ కవీన్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు.

Exit mobile version