NTV Telugu Site icon

Naga Chaitanya: దేవాలయంలో మందు సెటప్.. నాగచైతన్య పై గ్రామస్థులు దాడి..?

Chy

Chy

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైతన్య- కోలీవుడ్ డైరెక్టర్ ప్రభు కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చైతూ సరసన కృతిశెట్టి నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో మెల్కోటే గుడి ప్రాంతంలో జరుగుతోంది. అక్కడ భారీ బార్ సెటప్ వేసి కొన్ని కీలకమైన సన్నీవేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే షూటింగ్ జరుపుతుండగా పక్కనే ఉన్న గ్రామస్థులు చిత్ర బృందంపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారు షూటింగ్ చేస్తున్న పక్కనే ప్రసిద్ధ రాయగోపుర దేవాలయం ఉంది.

నిత్యం పూజలు జరుగుతూ పవిత్ర స్థలంగా ప్రజలు కొలిచే దేవాలయం పక్కన మందు సెటప్, బార్ సెట్ లు, నృత్యాలు ఏంటని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతేకాకుండా ఇది హిందువులను అవమానించడమే అని చిత్ర బృందం వేసిన సెట్ ను కూల్చివేశారట. సెట్‌ను నిర్మించడానికి భారీ ఇనుప స్తంభాలను వాడగా వాటిని కూడా పెకిలించి వేసినట్లు సమాచారం. పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళారా అంటే అది కూడా కాదు.. ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి మాండ్య డిసి అశ్వతి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఆ అనుమతి కేవలం రెండు రోజులకు మాత్రమే అని, అందులోనూ ఇలాంటి సీన్స్ ఉంటాయని ఆయనకు చెప్పలేదని సమాచారం. ఇక గ్రామస్థులు దాడి చేసేటప్పుడు నాగ చైతన్య సైతం సెట్ లోనే ఉన్నాడని సమాచారం.అంతేకాకుండా అలా బార్ సెట్ వేసినందుకు చిత్ర యూనిట్ పై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే మేకర్స్ ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.

Show comments