Naga Chaitanya: సాధారణంగా పెళ్లికి ముందు అబ్బాయిలు, అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా పెళ్లి తరువాత వారిలో మార్పు వస్తుంది అనేది నమ్మదగ్గ నిజం. ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం కాబట్టి.. ఆ గ్లామర్ ను మెయింటైన్ చేస్తూ ఉండాలి. అందులో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 60 ఏళ్ళు దాటినా కూడా నాగార్జున ఇప్పటికీ నవ మన్మథుడు అని అనిపించుకుంటున్నాడు. తండ్రి పోలికలు ఎక్కడికి పోతాయి.. ఇప్పుడు జూనియర్ మన్మథుడు అక్కినేని నాగ చైతన్య సైతం.. వయస్సు పెరిగేకొద్దీ అందంలో తండ్రిని మించిపోయాడు. అదేం విచిత్రమో.. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని, సంతోషంగా ఉన్నప్పుడు కంటే.. ఆమెకు విడాకులు ఇచ్చి, మళ్లీ సింగిల్ గా ఉన్నప్పుడు ఈ కుర్రాడిలో అందం రెట్టింపు అయ్యిందని జనాలు మాట్లాడుకుంటున్నారు.
Jagapathi Babu: రజినీకాంత్ ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడతాడు
ప్రస్తుతం చై.. కస్టడీ చిత్రంలో నటిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చై.. తన లుక్ తోనే సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయాడు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. సమంతతో విడాకులు తీసుకున్న దగ్గరనుంచి చై లో ఏదో తెలియని ఒక మార్పు కనిపిస్తుంది. సినిమాల ఎంపిక విషయంలో కానీ, దైర్యంగా మాట్లాడే విషయంలో కానీ.. మరి ముఖ్యంగా లుక్ విషయంలో పూర్తిగా మారిపోయాడు.. ఒకప్పుడు క్యూట్ గా ఉండే చై.. ఇప్పుడు హాట్ గా మారిపోయాడు. కస్టడీ ప్రమోషన్స్ లో చై ను చూసిన వారందరు పెళ్ళయాక యావరేజ్ గా ఉన్నాడు.. విడాకులు తీసుకున్నాక ఏంటిరా ఇంత అందంగా ఉన్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ లుక్ లో ఒక సినిమా పడితే.. ఉంటుంది నా సామీరంగా అంటూ ఎత్తేస్తున్నారు. మరి ఈ కస్టడీ.. ఈ అక్కినేని వారసుడును ఎలా నిలబెడుతుందో చూడాలి.
