NTV Telugu Site icon

Naga Chaitanya: సమంతను చూసి.. థియేటర్ లో నుంచి బయటకొచ్చేసిన చై.. ?

Chy

Chy

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని దాదాపు రెండేళ్లు అవుతుంది, అయినా కూడా వీరిద్దరికీ సంబంధించిన వార్త ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంది. సమంత, నాగచైతన్య అనే పేరు వినిపిస్తే చాలు ఏవేవో వార్తలు అల్లేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తూ ఉంటారు .. కొంతమంది ట్రోలర్స్. ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి కెరీర్ లో వాళ్ళు ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకపక్క సామ్.. ఖుషీ సినిమా తరువాత సినిమాలకు ఒక ఏడాది బ్రేక్ తీసుకొనగా.. ఇంకోపక్క చైతూ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక నాగచైతన్య ఎక్కడ కనిపించినా.. ఏ ప్రెస్ మీట్ కి వచ్చినా.. ఖచ్చితంగా సమంత టాపిక్ వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.

Pawan Kalyan: బ్రో.. మళ్లీ ఇంకో రీమేకా.. అది కూడా ఆ డైరెక్టర్ తో.. ?

ఇక తాజాగా చైతన్య గురించి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈమధ్య ఒక సినిమా చూడడానికి చైతన్య థియేటర్ కు వెళ్ళగా సినిమా మధ్యలో సమంత, విజయ్ దేవరకొండ నటించిన ఖుషీ ట్రైలర్ ను ప్లే చేశారట. ఖుషీ ట్రైలర్ లో సమంతను చూడలేక చైతన్య బయటకు వచ్చేసాడని కొన్ని వెబ్ సైట్స్ రాసుకోచ్చాయి. ఇక ఈ వార్తలపై చైతన్య స్పందించాడు. ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ పై చైతన్య మాట్లాడుతూ.. “అవన్నీ చెత్త వార్తలు. అందులో ఎలాంటి నిజం లేదు. కొన్ని తెలుగు వెబ్ సైట్స్ కూడా ఈ వార్తను రాసుకొచ్చాయి. అవి నేను కూడా చూశాను. ఆ వార్తలను సరి చేయాల్సిందిగా ఇప్పటికే వాళ్లకు సూచించాం..” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చైతన్య వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments