Site icon NTV Telugu

Naga Chaitanya: దూసుకొస్తున్న ‘తండేల్’… తగ్గేదేలే!

Thandel

Thandel

సినిమాల పరంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగ చైతన్య… రీసెంట్‌గా ధూత సిరీస్‌తో ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. ఇదే జోష్‌ని కంటిన్యూ చేస్తూ… ఇప్పుడు తండేల్‌గా జెట్ స్పీడ్‌లో దూసుకొస్తున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటి… ఈసారి చైతన్యకు సాలిడ్ హిట్ ఇవ్వాలని భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. గతంలో చందు, చై కలిసి చేసిన ప్రేమమ్, సవ్యసాచి అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయాయి. అందుకే ఈసారి శ్రీకాకుళం నేపథ్యంలో సముద్రం బ్యాక్ డ్రాప్‌లో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ‘తండేల్’ సినిమా చేస్తున్నారు. చైతన్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో తండేల్ పై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా నుంచి… నాగ చైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్‌ కూడా రిలీజ్ చేశారు.

రీసెంట్‌గా సముద్రం మధ్యలో తండేల్ షూటింగ్ అంటూ అప్డేట్ ఇచ్చారు. ఇదే స్పీడ్‌లో ఏ మాత్రం తగ్గకుండా ఇప్పుడు గ్లింప్స్‌కి సంబందించిన అప్డేట్ ఇచ్చారు… ఎసెన్స్ ఆఫ్ తండేల్‌ను జనవరి 5న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తండేల్ కథ పై ఓ క్లారిటీ రానుంది. ఖచ్చితంగా ఈ సినిమాతో చైతన్య మాస్ ట్రీట్ ఇవ్వడం గ్యారెంటీ అని అక్కినేని అభిమానులు నమ్ముతున్నారు. ఈ మధ్య అక్కినేని హీరోలు రేసులో వెనకబడిపోయారు. అందుకే… సంక్రాంతికి రానున్న నాగార్జున ‘నా సామిరంగ’, చైతన్య ‘తండేల్’ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాను GA2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version