Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక దీనికన్నా ముందు చై.. దూత సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు. అదేంటి.. రేపు కదా స్ట్రీమింగ్.. అప్పుడే ఇచ్చాడు అని అంటున్నారు ఏంటి.. ? అని కన్ఫ్యూజ్ అవ్వకండి. అమెజాన్ మేకర్స్.. అభిమానులకు స్వీట్ సర్పైజ్ ఇచ్చారు. డిసెంబర్ 1 న కాకుండా ముందు రోజు.. అంటే కొద్దిసేపటి నుంచే ఈ సిరీస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మనం, థాంక్యూ లాంటి సినిమాలతో చై- విక్రమ్ కె కుమార్ కాంబో ఎంత మంది పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థాంక్యూ ప్లాప్ అయినా కూడా వీరి కాంబోపై అభిమానులు ఆశలు చంపుకోలేదు. ఇక విక్రమ్ కె కుమార్ అంటే.. టక్కున 13 బి గుర్తొస్తుంది. అలాంటి ఒక సినిమా తీయాలని అభిమానులు ఎప్పటినుంచోకోరుకుంటున్నారు. ఇక ఆ కోరిక ఇప్పుడు దూత రూపం లో తీరబోతుంది అని తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు విక్రమ్. మొట్ట మొదటిసారి చై.. హర్రర్ సిరీస్ లో నటించాడు. ఇందులో.. ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
Ashish Reddy: ఘనంగా దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ నిశ్చితార్థం..
ఇక చై తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెడుతూ ” షోటైమ్.. దూత ఇప్పుడే డ్రాప్ అయ్యింది. స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్.. లాంగ్ ఫార్మెట్, షార్ట్ ఫార్మెట్.. ఇలా ఏదయినా ఒక పాత్రలో నటించడం, కథనంలో భాగం కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి స్పెషల్ పాత్రకు నాకు ఇచ్చినందుకు.. విక్రమ్ కె కుమార్, అమెజాన్ ప్రైమ్ కు ధన్యవాదాలు” అని రాసుకొచ్చాడు. మరి ఈ సిరీస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
