NTV Telugu Site icon

Naga Chaitanya: ‘కస్టడీ’ నుంచి బయటపడ్డ నాగచైతన్య..

Chy

Chy

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈచిత్రంలో మొట్ట మొదటి సారి చై.. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా గురించిన ఒక అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. నేటితో ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకున్నట్లు తెలుపుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.

Viral News: ఏడు అడుగుల పురుషాంగంతో నడిరోడ్డుపై అమ్మాయిల వెంట పడుతూ..

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో వెంకట్ ప్రభు శైలి వేరు. క్రైమ్ థ్రిల్లర్స్ తీయడంలో ఆయన అందెవేసిన చేయి. ఇక లవ్ స్టోరీ తరువాత చైతుకు మంచి హిట్ పడింది లేదు. దీంతో ప్రస్తుతం అక్కినేని హీరో ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఒక్క చై అనే కాదు హీరోయిన్ కృతి శెట్టి కూడా ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఈ సినిమ తెరకెక్కుతోందని టాక్. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అక్కినేని హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.