ఏజెంట్ సినిమాతో అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఫ్లాప్ ఇచ్చాడు. కింగ్ నాగార్జున ఘోస్ట్ సినిమాతో సాలిడ్ హిట్ ఇస్తాడు అనుకుంటే ఊహించని రిజల్ట్ తో షాక్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు అక్కినేని అభిమానులని నీరస పడేలా చేసాయి. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య అయినా హిట్ ఇచ్చి అక్కినేని ఫ్యాన్స్ కి కాస్త రిలీఫ్ ఇస్తాడు అనుకుంటే కస్టడీ సినిమాతో నిరాశ పరిచాడు. ముగ్గురు అక్కినేని హీరోలు ఫ్లాప్స్ ఇవ్వడంతో ఎప్పుడూ లేనంత డౌన్ ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. ఈ డిజప్పాయింట్మెంట్ ని ఒక్క బర్త్ డేతో తీర్చేసాడు నాగ చైతన్య. బర్త్ డేకి ఒక రోజు ముందే తన మొదటి పాన్ ఇండియా సినిమా ‘తండేల్’ ఫస్ట్ లుక్ ని ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు చై. తండేల్ ఫస్ట్ లుక్ తో అక్కినేని ఫ్యాన్స్ కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యారు.
ఈరోజు నాగ చైతన్య బర్త్ డే కావడంతో తండేల్, నాగ చైతన్య ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అక్కినేని అభిమానుల జోష్ ని మరింత పెంచుతూ దూత వెబ్ సీరీస్ ట్రైలర్ కూడా బయటకి వచ్చేసింది. ఓటీటీ డెబ్యూ ఇస్తున్న నాగ చైతన్య… దూత ట్రైలర్ లో టెర్రిఫిక్ గా ఉన్నాడు. విక్రమ్ కుమార్ తన మార్క్ థ్రిల్లర్ తో నాగ చైతన్యని కొత్తగా ప్రెజెంట్ చేసాడు. జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్న నాగ చైతన్య… “మేము మెసేంజర్స్… తెలుగులో చెప్పాలి అంటే దూతలం” అన్న డైలాగ్ ట్రైలర్ లో పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది. ట్రైలర్ విజువల్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ ఇంట్రిగ్యుయింగ్ గా ఉన్నాయి. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో దూత సీరీస్ స్ట్రీమ్ అవ్వనుంది. దూత అండ్ తండేల్ అనౌన్స్మెంట్స్ తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.