Naga Chaitanya buys Hyderabad Blackbirds Motorsport team : అక్కినేని హీరో నాగచైతన్య చివరిగా కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఈ సినిమాలో కానిస్టేబుల్ శివ అనే పాత్రలో నాగచైతన్య కనిపించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన మేర ఫలితాలు మాత్రం అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సినిమాలు ఎంపిక విషయంలో కేర్ తీసుకుంటున్న నాగచైతన్య ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు లైన్ లో పెట్టాడు. చందు మొండేటి దర్శకత్వంలో ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు గుజరాత్ వెళ్లి అక్కడి నుంచి సముద్రంలో వేటకు వెళ్లగా పాకిస్తాన్ నేవీకి చిక్కి కొన్నాళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి తర్వాత రెండు ప్రభుత్వాల చొరవతో విడుదలయ్యారు.
Allu Arjun: థాంక్స్ చెప్తే చాలదు.. అదిరే పాటలు కావాలి!
అందులో ఒక వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నారు. అదే మత్స్యకారుల గ్రామానికి ఇటీవల వెళ్లి నాగచైతన్య, చందు మొండేటి, బన్నీ వాసు వారిని కలిసి వచ్చారు. ఇక ఆయన ఈ సినిమా మీద ఫోకస్ పెట్టబోతున్నారు. ఇక ఈ లోపు విక్రమ్ దర్శకత్వంలో చేసిన దూత వెబ్ సిరీస్ విడుదలకు రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా మరోపక్క ఇండియన్ రేసింగ్ లీగ్ మరియు F4 ఇండియన్ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ మోటార్‌స్పోర్ట్ జట్టును కొనుగోలు చేసి ఇప్పుడు అయి ఆ జట్టుకు నాగ చైతన్య యజమాని అయ్యాడు. ఇండియన్ రేసింగ్ లీగ్ మరియు F4 ఇండియన్ ఛాంపియన్‌షిప్ పోటీలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి.