Nachinavadu Teaser: కొత్త డైరెక్టర్ లక్ష్మణ్ చిన్నా.. దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం నచ్చినవాడు. ఏనుగంటి ఫిలిం జోన్ సమర్పణలో ఒక ఉమెన్ సెంట్రిక్ లవ్ ఫ్యామిలీ డ్రామా చిత్రంగా తెరకెక్కింది. ఇక ఈ చిత్రంతో కన్నడ, తెలుగు నూతన నటీనటులను పరిచయం కానున్నారు. కావ్యా రమేష్, దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్,ABRP రెడ్డి తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి కానీ ఒక యువకుడు తన సోల్ మేట్ కోసం వెతికే వేటనే ఈ సినిమా అని తెలుస్తోంది. 30 ఏళ్లు వచ్చినా అమ్మాయిలంటే భయపడే ఒక యువకుడు తన సోల్ మేట్ ను ఎలా గుర్తుపట్టాడు. చివరికి తనకు నచ్చిన అమ్మాయి చేత నచ్చినవాడు అనిపించుకున్నాడా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రపంచంలో పెళ్లి కానీ వెధవలు చాలామంది ఉన్నారు.. నేను కరుడు గట్టిన బాలయ్య అభిమానిని, నా ఇష్టమొచ్చిన అమ్మాయిని లవ్ చేస్తా.. అనే డైలాగ్స్ నవ్వు తెప్పిస్తున్నాయి.
Renu Desai: “ఆ పిచ్చి ఫ్యాన్స్ నోళ్లు మూయించు.. పవన్”
స్త్రీ ఆత్మాభిమానం, ప్రేమ కలగలిపి ఒక విభిన్న కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మీజో జోసెఫ్ ఇచ్చిన చక్కటి నేపథ్య సంగీతం ఆకట్టుకొంటుంది.ఎక్కడా రాజీ పడిన నిర్మాణ విలువలతో, చక్కని కథాంశంతో, ప్రతిభావంతులైన నటులతో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రేక్షకులని అలరిస్తుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేస్తామని హీరో కమ్ డైరెక్టర్ లక్ష్మణ్ చిన్నా తెలిపాడు.