Site icon NTV Telugu

Dhurandhar 2: నేనెప్పుడు దావూద్ ఇబ్రహీంను కలవలేదు: రియల్ జమీల్ జమాలీ..

Dhurandhar 2

Dhurandhar 2

Dhurandhar 2: ధురంధర్-1, ధురంధర్-2లు పాకిస్తాన్‌లో సంచలనంగా మారాయి. ఈ దేశ ప్రభుత్వం ఈ చిత్రాన్ని బ్యాన్ చేసినప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం విచ్చలవిడిగా డౌన్‌లోడ్ చేసుకుని చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా, పాకిస్తాన్‌లో నెంబర్ 1 వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు ధురంధర్ 2 కూడా ఇటు భారత్‌లో బాక్సాఫీస్‌ను కొల్లగొడుతుంటే, పాకిస్తాన్ ప్రజలు పైరసీ డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు.

Read Also: Fakhar Zaman: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన.. పాకిస్థాన్ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌పై నిషేధం

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో ‘‘జమీల్ జమాలి’’ క్యారెక్టర్ ధురంధర్2లో సంచలనంగా మారింది. రాకేష్ బేడి నటించిన ఈ పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే, ఇప్పుడు నిజమైన పాకిస్తానీ ‘‘జమీల్ జమాలి’’పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ధురంధర్ 1 సినిమాలో జమీల్ జమాలి పాత్ర తనదే అని పాకిస్తాన్ రాజకీయ నాయకుడు నబిల్ గబోల్ వార్తల్లో నిలిచారు. అయితే, ధురంధర్ 2లో అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను చంపే సీన్ ఉంది. దీని తర్వాత జమీల్ జమాలి పాత్ర తనది కాదంటూ ప్లేట్ మార్చడం ద్వారా నబిల్ మరోసారి చర్చనీయాంశంగా మారారు.

ఒక కార్యక్రమంలో నబిల్ గబోల్‌ను ఉద్దేశిస్తూ, ఇంటర్వ్యూయర్.. ‘‘మా ముంబై నుండి కరాచీలో నివసిస్తున్న ఒక పొరుగు వ్యక్తి ఉన్నారు, ఆయన్ని ‘బడే సాహెబ్’ అని పిలుస్తుంటారు. మీరు ఆయన్ని ఎప్పుడైనా కలిశారా?’’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన నబిల్.. ‘‘తాను ఎప్పుడూ దావూద్ ఇబ్రహీంను కలవలేదని, అతను నిజంగా కరాచీలో ఉండాడో లేదో కూడా తెలియదని, ధురంధర్ 2 తర్వాత ఈ ప్రచారం జరుగుతోందని’’ అన్నారు. తన ఇళ్లు దావూద్ ఉండే క్లిఫ్టన్ ప్రాంతంలో ఉన్నప్పటికీ తానెప్పుడు దావూద్‌ను చూడలేదని అన్నారు.

Exit mobile version