దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్” 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్” నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు. నాలుగు భాషల్లో విడుదలైన “ఆర్ఆర్ఆర్” సెకండ్ సింగిల్ ప్రోమో సాంగ్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. “నాటు నాటు” అంటూ సాగిన ఈ చిన్న ప్రోమో చూస్తే సాంగ్ ఊర నాటు అన్న విషయం స్పష్టమవుతోంది. రేపు సాయంత్రం 4 గంటలకు పూర్తి సాంగ్ విడుదల కానుంది.
Read Also : “ఆర్ఆర్ఆర్” స్పెషల్ డైలాగ్ లీక్ చేసిన రాజమౌళి
ఈ సినిమా ప్రమోషన్ల కోసం భారీ ప్లాన్లు వేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటకు మంచి రెస్పాన్స్ రాగా, సినిమా ప్రమోషన్ల కోసం దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ తో చేతులు కలిపారు. ఇప్పటి నుంచి సినిమా విడుదలయ్యే వరకు పీవీఆర్ థియేటర్లలో “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లు జరగనున్నాయి.
