NTV Telugu Site icon

Naa Saamiranga: 7 రోజుల్లో బ్రేక్ ఈవెన్… సంక్రాంతి కింగ్ అని నిరూపించాడు

Nagarjuna

Nagarjuna

సంక్రాంతికి కింగ్ వస్తే హిట్ కొట్టినట్లే అనే మాటని నిజం చేస్తూ నా సామిరంగ సినిమా అన్ని సెంటర్స్ లో మొదటి వారమే బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయ్యింది. నైజాంలో ఈరోజుతో బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అవనున్న నా సామిరంగ సినిమా ఆంధ్రాలోని అన్ని సెంటర్స్ లో ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యింది. ఏడు రోజుల్లో ఈ సినిమా 41.3 కోట్లని కలెక్ట్ చేసి, సక్సస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది. ఈ మధ్యలో రిలీజయ్యే సినిమాలు పెద్దగా లేవు కాబట్టి నా సామిరంగ ఫైనల్ కలెక్షన్స్ తో బయ్యర్స్ కి బాగానే డబ్బులు మిగిలే అవకాశం ఉంది. హనుమాన్ తర్వాత సంక్రాంతి సీజన్ కి సెకండ్ క్లీన్ హిట్ గా నిలిచింది నా సామిరంగ.

Read Also: Ruhani Sharma: పసుపు రంగు శారీలో మురిసిపోతున్న రుహాని శర్మ…!

అక్కినేని అభిమానుల్లో జోష్ నింపిన నాగార్జున సంక్రాంతికి వస్తే హిట్ కొడతాడు అనే మాటని ప్రూవ్ చేసింది నా సామిరంగ. ఇకపై సంక్రాంతి సీజన్ లో నాగార్జున ఎప్పుడు నిలబడిన… హిట్ కొట్టబోతున్నాడు అనే క్లారిటీకి వచ్చేయాలేమో. మజ్ను సినిమా నుంచి మొదలుపెడితే బంగార్రాజు సినిమా వరకూ నాగార్జున సంక్రాంతి సీజన్ లో నిలబెట్టిన సినిమా ఫ్లాప్ అవ్వలేదు. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు, నా సామిరంగా సినిమాలతో నాగార్జున హ్యాట్రిక్ సంక్రాంతి హిట్స్ కొట్టాడు. నెక్స్ట్ ఇయర్ బంగార్రాజు పార్ట్ 3 వస్తుందని కూడా నాగార్జున చెప్పేసాడు. సో 2025 సంక్రాంతికి కూడా కింగ్ నాగ్ సాలిడ్ హిట్ కొట్టబోతున్నాడు అనమాట.

Read Also: Guntur Kaaram: కీరవాణితో కలిసి సినిమా చూసిన జక్కన్న…