Site icon NTV Telugu

Naa Inti Number 13: నాకు మగాళ్లంటే మహా కోపం.. కానీ అంటున్న పుష్ప సింగర్

Inti Number 13

Inti Number 13

Naa Inti Number 13 Promotional Song: డిఫరెంట్‌ హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఇంటి నెం.13’ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ ఇప్పటికే ఆడియన్స్‌లో కొంత ఆసక్తి ఏర్పరచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. ‘పుష్ప’ తమిళ్‌ వెర్షన్‌లోని ‘సామీ..’ పాటను పాడిన రాజలక్ష్మీ ఈ ప్రమోషనల్‌ సాంగ్‌ను ఎంతో హుషారుగా ఆలపించడం గమనార్హం. ఇక ఈ పాటలోనే మేకింగ్‌ విజువల్స్‌ను కూడా జోడించగా ఎంత కష్టపడి తీశారు, ఎలాంటి క్వాలిటీతో చేశారనేది అర్థమవుతుంది. కాలింగ్‌బెల్‌, రాక్షసి చిత్రాలతో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసిన డైరెక్టర్‌ పన్నా రాయల్‌ ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని రూపొందించారు.

Minister Kottu Satyanarayana: టీడీపీ-జనసేన ఫస్ట్‌ లిస్ట్.. పవన్‌పై మంత్రి కొట్టు సెటైర్లు

కంటెంట్‌ పరంగా ఇప్పటి వరకు వచ్చిన హారర్‌ సినిమాలకు భిన్నంగా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని సినిమాను మార్చి 1న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు. రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్‌ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక విడుదలైన ప్రమోషన్‌ సాంగ్‌ గురించి డైరెక్టర్‌ పన్నా రాయల్‌ మాట్లాడుతూ ‘సినిమా కాన్సెప్ట్‌ను, మేకింగ్‌ను తెలియజేసే ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అయితే ఎవరితో ఈ పాటను పాడించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘పుష్ప’ తమిళ్‌ వెర్షన్‌లో ‘సామి..’ పాటను పాడిన రాజలక్ష్మీ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించడం జరిగిందన్నారు. నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్‌రాజ్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌, నెల్లూరు సుదర్శన్‌, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు వినోద్‌ యాజమాన్య సంగీతం, పి.ఎస్‌.మణికర్ణన్‌ సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version