టాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ పదే పదే వాయిదా పడటం, దానివల్ల చిన్న సినిమాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఇటీవల పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘418’ సినిమా మీడియా ఇంటరాక్షన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాత రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ ‘ఫౌజీ’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాల రిలీజ్, వాయిదాల వ్యవహారంపై ఆయన మీడియాకు క్లారిటీ ఇచ్చారు.
‘ఫౌజీ’ సినిమాను మార్చి 19న ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేస్తామని రవిశంకర్ స్పష్టం చేశారు. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎలాంటి హడావుడీ లేకుండా నెల రోజుల ముందు నుంచే పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నామన్నారు. “మేము సినిమాలు తీయడం మొదలుపెట్టినప్పటి నుంచి చూసుకుంటే.. మా బ్యానర్లో తెరకెక్కుతున్న అద్భుతమైన, మాకు అత్యంత ఇష్టమైన ప్రాజెక్టుల్లో ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ ఉంటాయి. వీటి విషయంలో ఎలాంటి తేడా జరగనివ్వం. మీడియా నుంచి, ప్రేక్షకుల నుంచి ఒక్క మాట కూడా అనిపించుకోకుండా చెప్పిన తేదీకే బ్రహ్మాండంగా వైడ్ రిలీజ్ చేస్తాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల అక్కినేని నాగార్జున, నిర్మాత ధీరజ్ మొగిలినేని లాంటి వారు పెద్ద సినిమాల వాయిదాల వల్ల చిన్న నిర్మాతలు పడుతున్న కష్టాల గురించి బహిరంగంగానే మాట్లాడారు. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధి ప్రస్తావించగా.. రవిశంకర్ సానుకూలంగా స్పందించారు. “పెద్ద సినిమాలకు అనివార్య కారణాల వల్ల కొన్ని సమస్యలు రావడం సహజం. వాటిని అధిగమించే ప్రాసెస్ మొదలుపెట్టాం. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫినిష్ అయ్యే వరకు పక్కా షెడ్యూల్ ప్లాన్ చేసుకుని, అవసరమైతే ఇంకొంచెం గ్యాప్ తీసుకుని మరీ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తాం. కానీ ఇకపై రిలీజ్ డేట్స్ వాయిదా వేయకూడదనే విషయాన్ని మేము చాలా పర్సనల్‌గా తీసుకున్నాం. డేట్స్ మారడం వల్ల మనకే కాదు, మిగతా సినిమాలకు కూడా ఇబ్బంది వస్తుంది. మొన్న నాగార్జున గారు చెప్పిన మాటలను మేము సీరియస్‌గా తీసుకుంటున్నాం. సిన్సియర్‌గా ఫాలో అవుతాం” అని ఆయన మాటిచ్చారు.

