NTV Telugu Site icon

Mytri Movie Mekars: మరో ‘వార్’ కన్ఫామ్ రా.. ఫిక్స్ చేసేసుకోండి

Naveen

Naveen

Mytri Movie Mekars: మైత్రీ మూవీ మేకర్స్… ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తోంది. సంక్రాంతి బరిలో రెండు సినిమాలను పోటాపోటీగా రిలీజ్ చేసి హిట్స్ అందుకున్న ప్రొడక్షన్ హౌస్ అంటే మైత్రీనే.. ప్రస్తుతం స్టార్ హీరోల పెద్ద పెద్ద సినిమాలన్నీ వీరి చేతుల మీదనే నిర్మితం అవుతున్నాయి.ఇక మైత్రీ.. ప్రస్తుతం అన్ని భాషల్లో అడుగుపెట్టాలని చూస్తోంది. తమ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే మైత్రీ.. బాలీవుడ్ లో పాగా వేయడానికి సిద్దమయ్యింది. ఆర్ఆర్ఆర్ కు మించిన మల్టీస్టారర్ ను ప్లాన్ చేయడానికి రెడీ అయ్యింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మల్టీస్టారర్ ను మైత్రీ ఫిక్స్ చేసేసింది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ కాదు కాదు హిట్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఏ.. ఇదంతా రూమర్ అని ఇప్పటివరకు అనుకున్నారు అభిమానులు. కాదురా బాబు ఇది నిజమే అని చెప్పడానికే.. నేడు సిద్దార్థ్ ఆనంద్ ను మైత్రీ మూవీ మేకర్స్ లో ఒకరైన నవీన్ యెర్నేని కలిసినట్లు తెలుస్తోంది. పఠాన్ సినిమాతో పడిపోతున్న బాలీవుడ్ ను లేపిన డైరెక్టర్ సిద్దార్థ్.. ప్రస్తుతం పఠాన్.. విజయవంతంగా భారీ కలక్షన్స్ ను కొల్లగొడుతున్న నేపథ్యంలో ఆయనను కలిసి నవీన్ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ప్రభాస్- హృతిక్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యినట్టే అని చెప్పుకొవచ్చు. సిద్దార్థ్ కు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ లు తీయడం కొత్త కాదు. ఇప్పటికే హృతిక్ రోషన్- టైగర్ ష్రాఫ్ తో వార్ సినిమా తీసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు అంతకు మించిన మల్టీస్టారర్ ను తీయడానికి సిద్దమయ్యాడు. ఇక దీంతో ఎప్పుడెప్పుడు.. హృతిక్- ప్రభాస్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారో అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Show comments