NTV Telugu Site icon

Mythri Movie Makers: మలయాళ ఇండస్ట్రీలోకి మైత్రీ మూవీ మేకర్స్.. టోవినో థామస్‌తో భారీ బడ్జెట్ మూవీ

Mythri Movie Makers Into Malayalam

Mythri Movie Makers Into Malayalam

Mythri Movie Makers Venturing Into Malayalam: ఇప్పటికే తెలుగు స్టార్ హీరోలతో అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించిన టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ మలయాళంలో అడుగుపెడుతోంది. మిన్నల్ మురళి, తల్లుమల, 2018 చిత్రాలతో వరుస విజయాలు సాధించిన మలయాళ స్టార్ టోవినో థామస్‌తో “నడికర్ తిలకం” అనే భారీ బడ్జెట్ సినిమాను నిర్మించేందుకు సిద్ధమైంది. మలయాళంలో సంచలన విజయం సాధించిన డ్రైవింగ్ లైసెన్స్‌ సినిమాని రూపొందించిన లాల్ జూనియర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మైత్రీ మూవీ మేకర్స్ తమ మొదటి మలయాళ చిత్రాన్ని గాడ్‌స్పీడ్‌ సంస్థతో కలిసి నిర్మించనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, అల్లన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

Double iSmart: డబుల్ ఇసార్ట్ కూడా ముంబైలోనే మొదలెట్టిన పూరీ

ఇక “‘నడికర్ తిలకం” ముహూర్తం వేడుక ఈరోజు ఘనంగా జరగగా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు కొచ్చిలో ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాని 120 రోజుల పాటు వివిధ లొకేషన్లలో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక టోవినో థామస్ ఈ సినిమాలో అనేక సవాళ్ళతో కూడిన సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ అనే పాత్రలో నటిస్తున్నారు. సౌబిన్ షాహిర్ బాల అనే పాత్రలో కనిపించనుండగా, భావన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ లిస్టు పెద్దదే ఎందుకంటే ధ్యాన్ శ్రీనివాసన్, అనూప్ మీనన్, షైన్ టామ్ చాకో, అజు వర్గీస్, శ్రీనాథ్ భాసి, లాల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదండోయ్ ఈ సినిమా కోసం అనేక టాలెంటెడ్ సాంకేతిక నిపుణులు సినిమా కోసం పని చేస్తున్నారు. ఆల్బీ సినిమాటోగ్రాఫర్ గా, రతీష్ రాజ్ ఎడిటర్ గా యక్జాన్ గ్యారీ పెరీరా, నేహా నాయర్ సంగీత దర్శకులుగా వ్యవహరించనున్న ఈ సినిమాకి ప్రశాంత్ మాధవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించనున్నారు.