NTV Telugu Site icon

Srimanthudu Copyright Case: శ్రీమంతుడు కాపీరైట్ కేసు.. ఎట్టకేలకు పెదవి విప్పిన మైత్రీ మూవీ మేకర్స్.. మరి కొరటాల?

6 Yrs for Industry Hit in Mahesh Babu's Srimanthudu

Mythri Movie Makers Repsonds on Srimanthudu Copyright Case: గత కొద్ది రోజులుగా శ్రీమంతుడు కాపీరైట్ వివాదం హాట్ టాపిక్ అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో తన మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చూడాలని ఆ సినిమా కధా రచయితా, దర్శకుడు కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ విషయంలో తామేమీ చేయలేము అని కింద కోర్ట్ ఏం చెబితే అది కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కేసు వేసిన రైటర్ శరత్ చంద్ర పలు చానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. దీంతో అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపద్యంలో ఎట్టకేలకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ వివాదం మీద ఒక అఫీషియల్ స్టేట్మెంట్ లిస్ట్ చేసింది. జరుగుతున్న వివాదం గురించి స్పందిస్తూ కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు సినిమా రైటర్ శరత్ చంద్ర చెబుతున్న చచ్చేంత ప్రేమ నవల లాగానే ఉంటుందని కేసు వేయడం జరిగింది.

Vijay Political Party: విజయ్ ఫ్యాన్స్ కి కొంచెం ఇష్టం కొంచెం కష్టం.. పొలిటికల్ పార్టీతో పాటు చివరి సినిమా కూడా ప్రకటన

అయితే ఈ రెండు ప్రస్తుతానికి పబ్లిక్ డొమైన్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటికి ఎలాంటి పొంతన లేదు, నవల చదివి పుస్తకం చూసిన వారికి ఆ విషయం ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ విషయం ప్రస్తుతానికి కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో మీడియా ఎలాంటి కంక్లూషన్ కి రావద్దని మేం కోరుకుంటున్నాం. కోర్టు ఏ విషయం తేల్చి చెప్పే వరకు కామెంట్స్ చేసేవారు కూడా కాస్త సంయమనం పాటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఒక ఊరిని దత్తత తీసుకుని సేవ చేయాలనే కోర్ ఐడియా తోనే మా శ్రీమంతుడు సినిమా తెరకెక్కింది. ఇది కచ్చితంగా మా ఆలోచన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మా సినిమాని ఆ నవలని పోల్చి చూడాలి అనుకునే వారిని వ్యక్తిగతంగా మేము ప్రోత్సహిస్తున్నాం. అయితే మాకు లీగల్ ప్రాసెస్ మీద ఉన్న నమ్మకం కారణంగా మేము కోర్టు ఏం చెబుతుందో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు దయచేసి ఈ విషయం మీద రకరకాల వార్తలు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి అంటూ సదరు స్టేట్మెంట్లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పేర్కొంది.