Mythri Movie Makers Bringing’Manjummel Boys’ To Telugu Audience Grand Release On April 6th: ఫిబ్రవరి నెలలో, భారతీయ సిని ప్రేమికులు అందరూ మాలీవుడ్‌పై ఎక్కువ ద్రుష్టి పెట్టారు. దీనికి కారణం.. వారం వారం గ్యాప్ తో థియేటర్లలోకి వచ్చిన మూడు సినిమాలు ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మాళ్ బాయ్స్ విజయాలు సాధించడమే. ఇందులో మలయాళం మునుపెన్నడూ కలగని విజయాన్ని మంజుమ్మాళ్ బాయ్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రేమలు కలెక్షన్ల రికార్డులు సృష్టించాయి. కొత్త బాక్సాఫీస్ రికార్డును సృష్టించిన మంజుమ్మల్ బాయ్స్ తాజాగా తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్ 6న సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి.
Prashanthi Harathi: టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అయిన పెళ్ళాం ఊరెళితే నటి..
చిదంబరం దర్శకత్వం వహించిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం మొదటి స్థానంలో నిలిచింది. కొడైకెనాల్ ప్రధాన కథా నేపథ్యంతో, కమల్ హాసన్ యొక్క గుణ సినిమా రిఫరెన్స్ కూడా ఉండడంతో ఈ చిత్రం తమిళనాడులో భారీ కలెక్షన్లను సాధించింది, అయితే ఈ చిత్రాన్ని తమిళులతో పాటు మలయాళీలు కూడా ఎక్కువగా విదేశీ మార్కెట్లలో చూశారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమంటే నాలుగో వారం తర్వాత కూడా ఈ చిత్రానికి మంచి స్క్రీన్ కౌంట్ అలాగే ఆడియన్స్ లు ఉన్నారు. ఓటీటీ డీల్‌ని ముందే ఖరారు చేసి ఉంటే ఈ సినిమా ఓటీటీ కోసం ఎదురు చూసేవారు కానీ ఆ విషయంలో ముందుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాక్సాఫీస్ వసూళ్లకు బాగా లాభించింది. ఇక ఫిబ్రవరి 22, 2024 న విడుదలైన ఈ సినిమా మలయాళ చిత్రసీమలో 200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా కూడా నిలిచింది. మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. తమిళనాడులో ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మలయాళం నుంచి ఓ సినిమా తమిళంలో ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. మంజుమ్మల్ బాయ్స్ ఒక యదార్థ కథ ఆధారంగా సాగే థ్రిల్లర్. సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, ఖలీద్ రెహమాన్, లాల్ జూనియర్, చంతు సలీంకుమార్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, విష్ణు రఘు, అరుణ్ కురియన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుశీన్ శ్యామ్ సంగీతం సమకూర్చారు.