Site icon NTV Telugu

Samantha : సమంతకు అండగా బడా నిర్మాణ సంస్థలు..

Samantha

Samantha

Samantha : స్టార్ హీరోయిన్ సమంత అంటే ఇండస్ట్రీలో ఎంతో మందికి అభిమానం. అందులోనూ చాలా నిర్మాణ సంస్థల్లో గతంలో ఆమె పనిచేసింది. వారందరితో ఆమెకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు చేయట్లేదు గానీ.. వారితో ఆ మైత్రీ అలాగే కొనసాగుతోంది. అందుకే ఇప్పుడు బడా నిర్మాణ సంస్థలు సమంతకు అండగా నిలుస్తున్నాయి. ఆమె నిర్మాతగా మారి శుభం సినిమాను తీసింది. దాదాపు ఏడు కోట్లతో తీసిన ఈ సినిమా బిజినెస్ ను కూడా బాగానే చేస్తోంది. ఇప్పటికే మూడు కోట్ల వరకు లాభాలు వచ్చినట్టు సమాచారం. అయితే ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏకంగా బడా నిర్మాణ సంస్థలే రంగంలోకి దిగుతున్నాయి.
Read Also : TCC : కాశ్మీర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ నివాళి!

సాధారణంగా బడా నిర్మాణ సంస్థలు ఇలాంటి చిన్న సినిమాల జోలికిపోవు. కానీ సమంత కోసమే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నైజాం డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకున్నారు. ఇందుకు గాను సమంతకు రూ.కోటిన్నర దాకా చెల్లించారంట. అంటు ఉత్తరాంధ్ర, సీడెడ్ లో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి పెద్ద నిర్మాత అయిన సురేష్ బాబు స్వయంగా ముందుకు వచ్చారు. ఆ రెండు ఏరియాల్లో తాను పబ్లిష్ చేయిస్తానని చెప్పారంట. ఇలా అన్నీ బడా నిర్మాణ సంస్థలే ముందుకు వస్తుండటంతో సమంతకు మంచి నమ్మకం పెరుగుతోంది. మూవీపై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఏర్పడుతోంది. ఇది హిట్ అయితే సమంత ఇలాంటి చిన్న సినిమాలను మరిన్ని నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Athadu4k : రీరిలీజ్ లో రికార్డ్ ధర పలికిన మహేశ్ ‘అతడు’

Exit mobile version