Mythri Movie Makers Ajith Kumar – Adhik Ravichandran’s Good Bad Ugly Announced: చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రచారమే నిజం అయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అజిత్ కుమార్ ఒక సినిమా చేయనున్నారు. తమిళ్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ కథ అందించడమే కాదు దర్శకత్వం కూడా వహించనున్నారు. ఇక ఆయన విశాల్ మార్క్ ఆంటోనీ సినిమాతో హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. ఇక ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ ”దిగ్గజ స్టార్ అజిత్ కుమార్ సర్‌తో కలిసి సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నా, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ స్క్రిప్ట్ అలాగే స్క్రీన్ ప్లే చాలా చక్కగా ఉన్నాయి. అభిమానులు- సినిమా ప్రేమికులకు గ్రిప్పింగ్ అలాగే ఆకర్షణీయమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ” అని అన్నారు.
Manchu Manoj: మనోజ్ భార్య సీమంతం.. మంచు కుటుంబం లేకుండానే.. ?
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. ”అజిత్ కుమార్ సర్‌తో జట్టుకట్టడం ఆనందంగా ఉంది. అధిక్ దర్శకత్వ ప్రతిభ ఆయన మునుపటి చిత్రాలతో చాలా స్పష్టంగా కనిపిస్తుంది, ఈ సినిమాలో అతనిని తదుపరి స్థాయికి తీసుకెళ్లే అంశాలు ఉన్నాయి అని అన్నారు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ ”ప్రతి ఒక్కరి జీవితంలోనూ, కెరీర్‌లోనూ అమూల్యమైన క్షణాలు ఉంటాయి, ఇవి అవే అని నా నమ్మకం. నా మ్యాట్నీ ఐడల్ ఎకె సర్‌తో కలిసి పనిచేయడం చాలా కాలంగా ఒక కల. ఆయనతో కలిసి పని చేయడం ఒక వరంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్‌లకు కృతజ్ఞతలు’’ అన్నారు. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రీకరణ జూన్ 2024లో ప్రారంభమవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ 2025లో సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తమిళ హీరో-డైరెక్టర్-తెలుగు ప్రొడక్షన్ హౌస్ కాబట్టి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
