Site icon NTV Telugu

Sasivadane: ఏప్రిల్ 19న మైత్రీ డిస్ట్రిబ్యూషన్లో శశివదనే రిలీజ్

Sasivadane

Sasivadane

Mythri Distribution Releasing Sasivadane: ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘శశివదనే’ సినిమాను ఏప్రిల్ 19న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. . గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్న ఈ సినిమా. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించగా ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Tirumala Darshan: వెంకన్న స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. మూడు నెలలు వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు..!

ఈ నేపథ్యంలో ‘శశివదనే’ సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పి సంస్థ దక్కించుకుంది. రీసెంట్ టైమ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రీ సంస్థ ఇప్పుడు ‘శశివదనే’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు. రక్షిత్ అట్లూరి, కోమలీ, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version