NTV Telugu Site icon

My Name is Shruthi: వామ్మో అమ్మాయిల్ని ఇలా కూడా చేస్తారా.. హన్సిక కొత్త సినిమా ట్రైలర్ వణికిస్తోంది

My Name Is Shruthi

My Name Is Shruthi

My Name is Shruthi Movie Trailer: దేశ‌ముదురు సినిమాతో తెలుగు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హ‌న్సిక అన‌తికాలంలోనే స్టార్ హీరోయిన్ గుర్తింపును సొంతం చేసుకున్న‌ది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకుని గ్లామర్ రోల్స్ కి దూరమైంది. అలా దూరం అవడమే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. అలా ఆమె చేసిన సినిమా మై నేమ్ ఈజ్ శృతి. శ్రీ‌నివాస్ ఓంకార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను వైష్ణ‌వి ఆర్ట్స్ ప‌తాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా శనివారం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

Kannappa: మంచు విష్ణు కోసం బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్

అమ్మాయిల స్కిన్ కోసం ఒక ముఠా ఎంతకు అయినా తెగించడానికి సిద్ధం అయినట్టు చూపించారు. ఇక ట్రైలర్ చూస్తుంటే వణికించేలా ఎన్నో కట్స్ కూడా ఉంచారు మేకర్స్. ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం హన్సిక మాట్లాడుతూ..”ఇదొక గ్రేట్ సబ్జెక్ట్ థ్రిల్లర్, నా మనసుకు ఎంతో దగ్గరైన కథ డైరెక్టర్ శ్రీనివాస్ ఓంకార్ చాలా హార్డ్ వర్క్ చేశారు, వైష్ణవి ఆర్ట్స్ సంస్థ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాకర్ ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్, ఎంతో నిజాయితీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాతో మరోసారి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. ఇక ఈ సినిమాలో హన్సికతో పాటుగా ముర‌ళీశ‌ర్మ‌, ఆర్ నారేయ‌న‌న్‌, జ‌య‌ప్ర‌కాష్‌, వినోదిని, సాయితేజ‌, పూజా రామ‌చంద్ర‌న్‌, రాజీవ్ క‌న‌కాల ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Show comments