నటుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టి రైటర్ గా పలు హిట్ సినిమాలకు పని చేసి ఫైనల్ గా దర్శకత్వ విభాగంలో ల్యాండ్ అయ్యాడు వెంకీ అట్లూరి. స్నేహగీతం సినిమాతో నటుడిగా రైటర్ గా తోలి సక్సెస్ చూసారు. ఆ తర్వాత నటనకు స్వస్తి చెప్పి రైటర్ గా కేరింత సినిమాతో దిల్ రాజు దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. ఇక దర్శకుడిగా తోలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి NTVతో ముచ్చటించిన సందర్భంలో ఆయన కెరీర్ లోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
వెంకీ అట్లూరి డైరెక్టర్ గా ప్రయత్నాలు చేస్తున్న టైమ్ లో ఓ నిర్మాతను కలిసిన సందర్భంలో ఆయన చెప్పిన సలహా మేరకు నటనకు స్వస్తి పలికి డైరెక్టర్ అయ్యేందుకు ఓ కథ రాసుకుని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజును కలిశాడట. అదే మిస్టర్ మజ్ను. ఆ కథలో పొటెన్షియల్ చుసిన దిల్ రాజు కథను ఇచ్చేయమని కోరగా అందుకు నో అని చెప్పేశాడు. అదే టైమ్ లో కేరింత కు డైలాగ్ రైటర్ గా పని చేస్తూ దిల్ రాజు తో ట్రావెల్ అయ్యాడు. తన సినీ కేరిర్ లో రైటింగ్ లో కేరింత సినిమాకు బాగా కష్టపడ్డానని, ఆ అనుభవం నా కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పుకొచ్చారు. ఇక మరొక కథను రెడీ చేసి BVSN ప్రసాద్ ను కలిసి తొలిప్రేమ కథ చెప్పడం, అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అలా మిస్టర్ మజ్ను వెనక్కు వెళ్లి తొలిప్రేమ సెట్స్ పైకి వెళ్ళింది. తొలి సినిమా అయిన ‘తొలిప్రేమ’ సూపర్ హిట్ అయింది. వెంకీ అట్లూరి దర్శకత్వ ప్రతిభను, రైటింగ్ స్టైల్ ఆడియెన్స్ ను మెప్పించింది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్స్ అందించి పాన్ ఇండియా దర్శకుడు అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మారాడు వెంకీ అట్లూరి.
also Read : PuriSethupathi : ఛార్మితో చేతులు కలిపిన మరో నిర్మాత
