Site icon NTV Telugu

Prabhudeva: ‘మై డియర్ భూతం’ వచ్చేది ఎప్పుడంటే….

My Dear Bootham

My Dear Bootham

 

డాన్స్ మాస్టర్‌గా స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కంపోజ్ చేసి ప్రశంసలందుకున్నారు ప్రభుదేవా. మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు సినిమాలకు పనిచేసి తనలోని ప్రతిభను బయటపెట్టారు. ఇక నటుడిగా ఎన్నో సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలోనే ప్రభుదేవా ప్రధానపాత్రలో రాబోతున్న కొత్త సినిమా ‘మై డియర్ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు ఎన్. రాఘవన్.

అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మించారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ మూవీని తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకు మించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా ఇదే నెల 15వ తేదీ జనం ముందుకు రాబోతోంది. ఈ ఫాంటసీ మూవీలో జీనీగా ప్రభుదేవా నటించగా, రమ్య నంబీసన్ కీలక పాత్ర పోషించారు. బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. డి. ఇమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version