Muttu: యువ కథానాయకుడు శింబు, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘వెందు తనిందదు కాడు’. ఈ సినిమా గురువారం తమిళంలో విడుదల కాబోతోంది. అదే రోజున తెలుగులోనూ ‘ముత్తు’ పేరుతో డబ్ చేసి స్రవంతి మూవీస్ సంస్థ రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ఆఖరి నిమిషంలో ఏర్పడి సాంకేతిక సమస్యల వల్ల మూవీని రెండు రోజులు ఆలస్యంగా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. సో.. ‘ముత్తు’ సినిమా 15వ తేదీ కాకుండా 17వ తారీఖున జనం ముందుకు రానుంది. అయితే.. తమిళ వర్షన్ మాత్రం ఈ నెల 15 నుండి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రదర్శితమౌతోంది. మరి ఈ సినిమాతో శింబు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Muttu: రెండు రోజులు వెనక్కి వెళ్ళిన శింబు తెలుగు సినిమా!
Show comments