Site icon NTV Telugu

Mutton Soup : ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ లాంచ్..

‘mutton Soup’ Title Poster

‘mutton Soup’ Title Poster

రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో–హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మటన్ సూప్’. “విట్‌నెస్ ది రియల్ క్రైమ్” ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమాకు రామచంద్ర వట్టికూటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు విడుదల చేశారు. కాగా ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, నిర్మాత అరుణ్ చంద్ర వట్టికూటి, లైన్ ప్రొడ్యూసర్ కొమ్మా రామకృష్ణ, ఎడిటర్ లోకేష్ కడలి, నటుడు గోవింద్ రాజ్ నీరుడి తదితరులు పాల్గొన్నారు.

Also Read : Sunny Deol : ‘రామాయణ’‌లో తన పాత్ర గురించి.. సన్నీ డియోల్‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఈ సందర్భంగా కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ – “టైటిల్ పోస్టర్ బాగుంది. ‘మటన్ సూప్’ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు. నిర్మాత మల్లిఖార్జున ఎలికా మాట్లాడుతూ.. “మా టైటిల్ పోస్టర్ విడుదల చేసిన లెజెండరీ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు గారికి ధన్యవాదాలు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు మంచి చిత్రంతో రాబోతున్నాం” అన్నారు. హీరో రమణ్ మాట్లాడుతూ ’టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ అద్భుతంగా వచ్చాయి. రాత్రింబవళ్లు కష్టపడి చేస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు. అలాగే దర్శకుడు రామచంద్ర వట్టికూటి కూడా మాట్లాడుతూ “మా మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసినందుకు కె.ఎస్‌.రామారావు గారికి ధన్యవాదాలు. ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది” అన్నారు.

Exit mobile version