Site icon NTV Telugu

‘గాడ్ ఫాదర్’ మ్యూజిక్ సెషన్ స్టార్ట్

Music sessions of God Father going on a full swing

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రముఖ తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “గాడ్ ఫాదర్”. ఈ చిత్రం మలయాళ పొలిటికల్ బ్లాక్ బస్టర్ మూవీ “లూసిఫర్”కు రీమేక్ గా రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు ఎన్‌వి ప్రసాద్, ఆర్‌బి చౌదరి సంయుక్తంగా రామ్ చరణ్‌తో కలిసి నిర్మిస్తున్నారు. థమన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. చిరంజీవి పుట్టినరోజున టైటిల్ ను రివీల్ చేయగా, సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Read Also : డ్ర‌గ్స్ కేసు: షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ అరెస్ట్‌

ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్‌లో పూర్తయింది. తాజా షెడ్యూల్ ను ఊటీలో ప్లాన్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ‘గాడ్ ఫాదర్’ మ్యూజిక్ సెషన్ స్టార్ట్ చేశాడు యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్ మోహన్ రాజా, డిఓపి నీరవ్ షాతో కలిసి సినిమా గురించి చర్చించారు. ఆ తరువాత వారితో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసిన థమన్ ‘గాడ్ ఫాదర్’ మ్యూజిక్ సెషన్ ఫుల్ స్వింగ్ లో ఉందంటూ పోస్ట్ చేశారు.

Exit mobile version