డ్ర‌గ్స్ కేసు: షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ అరెస్ట్‌…

డ్ర‌గ్స్ కేసులో ఈరోజు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 8 మందిని అధికారులు అరెస్ట్ చేశారు.  ముంబైలోని 5 ప్రాంతాల్లో ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు.  క్రూయిజ్ రేవ్ పార్టీలో డ్ర‌గ్స్‌తో ప‌ట్టుబ‌డ్డ ఆర్య‌న్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు ఉద‌యం నుంచి ప్ర‌శ్నించారు.  ఆర్య‌న్ సెల్‌ఫోన్ లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి.  డ్ర‌గ్స్ పెడ్ల‌ర్స్‌తో ఆర్య‌న్ అనేక‌మార్లు వాట్సప్ ఛాటింగ్ చేసిన‌ట్టుగా గుర్తించారు.  ఆర్య‌న్ ఖాన్ ఫోన్‌ను అధికారులు సీజ్ చేశారు.  కాసేపట్లో ఆర్య‌న్ ఖాన్‌ను కోర్టులో హాజ‌రుప‌ర్చ‌నున్నారు.  

Read: రిప‌బ్లిక్‌పై లోకేష్ ట్వీట్‌… వింటున్నా… త్వ‌ర‌లోనే చూస్తాను…

-Advertisement-డ్ర‌గ్స్ కేసు:  షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ అరెస్ట్‌...

Related Articles

Latest Articles