Site icon NTV Telugu

ఆ కేసులో కంగనా సిస్టర్స్ కి బిగ్ రిలీఫ్..

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి ఆమె సోదరి రంగోలి చందేల్‌కు భారీ ఊరట కలిగింది. ముంబైలోని అంధేరిలోని 66వ కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లో న్యాయవాది కాషిఫ్ అలీ ఖాన్ దేశ్‌ముఖ్ దాఖలు చేసిన ఫిర్యాదును హైకోర్టు తోసిపుచ్చింది. గత ఏడాది ఏప్రిల్ 15న రంగోలీ తన ట్విట్టర్ ఖాతాలో తబ్లిఘి జమాత్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్లు పెట్టడంతో కాషిఫ్ అలీ ఖాన్ దేశ్‌ముఖ్ ఆమెపై కేసు వేశారు. సోదరికి సపోర్ట్ చేసినందుకు కంగనాకు కూడా లీగల్ నోటీసులు పంపారు. ఇక ఈ కేసును విచారించిన న్యాయస్థానం కాషిఫ్ అలీ ఖాన్ దేశ్‌ముఖ్ కి షాక్ ఇస్తూ పిటిషన్ ని రిజక్ట్ చేసింది.

భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 153-A, 153-B, 295-A మరియు సెక్షన్ 505 కింద నిందితులపై విచారణకు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి అని, అది లేని కారణంగా ఈ పిటిషన్ ని తిరస్కరిస్తునట్లు మేజిస్ట్రేట్ భగవత్ టి జిరాపే తీర్పునిచ్చారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన తగిన అధరాలు కూడా లేనందున ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఈ తీర్పుపై కాషిఫ్ అలీ ఖాన్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ “దిగువ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా తాను దిండోషి సెషన్స్ కోర్టులో క్రిమినల్ రివిజన్ దరఖాస్తును దాఖలు చేశానని చెప్పారు. దిండోషి సెషన్స్ కోర్టు దేశ్‌ముఖ్ రివిజన్ దరఖాస్తును నవంబర్ 15న విచారించనుంది. ఇకపోతే గతంలో కంగనా సిస్టర్స్ ట్విట్టర్ ద్వారా అనేక ఆరోపణలు చేశారు. వివిధ మతాల గురించి మాట్లాడుతూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, వారి మనోభావాలను దెబ్బతీశారని కాషిఫ్ అలీ ఖాన్ దేశ్‌ముఖ్ పిటిషన్ లో పేర్కొన్నాడు.

Exit mobile version