Atharva: పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా ‘అథర్వ’. యంగ్ హీరో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన ఈసినిమాకు మహేశ్ రెడ్డి దర్శకుడు. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను మేకర్లు ఇప్పుడు ఇచ్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయని, జూన్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్, టీజర్, ఫస్ట్ లుక్ కు చక్కని స్పందన లభించిందని, దానితో సినిమా మీద ప్రేక్షకుల అంచనాలు పెరిగాయని అన్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తుండగా, ఎస్. బి. ఉద్దవ్ ఎడిటర్‌గా పని చేశారు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా వ్యవహరించారు. ఇందులోని ఇతర ప్రధాన పాత్రలను అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామరాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు పోషించారు.
Karthik Raju: నాలుగు భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న ‘అథర్వ’!
Show comments