NTV Telugu Site icon

Mufasa The Lion King: ఒకే ఫ్రేములో రెండు సింహాలు!!

Mufasa The Lion King

Mufasa The Lion King

2019లో వచ్చిన ది లయన్ కింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆ చిత్రానికి సిక్వెల్ ముఫాసా: ది లయన్ కింగ్ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధంగా ఉంది, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఫాసాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. మహేశ్ తో పాటు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుంబాగా, అలీ టిమోన్‌గా తిరిగి వస్తున్నాడు. ఆగస్టు 26న తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయగా తాజాగా మరో ప్రెస్ మీట్ నిర్వహించి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

Also Read: Pushpa 2 Peelings: ఏంటి మామ ఆ గ్రేస్.. పీలింగ్స్ సాంగ్ అదిరిపోయింది!

నిజానికి హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ డిస్నీ ప్రతిష్ఠాత్మక నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ కూడా ఒకటి. ట్రైలర్‌లో ‘ముఫాసా’ పాత్రకి మహేష్ బాబు డబ్బింగ్‌ చెప్పడం అందరినీ ఆకర్షిస్తుంది. అద్భుతమైన విజువల్స్‌కి మహేష్ డైలాగ్స్‌ తోడవ్వడంతో ట్రైలర్‌ అద్భుతంగా అనిపించింది. నిజానికి మహేష్ చెప్పిన డైలాగులు ట్రైలర్‌లో హైలెట్ అయ్యాయి. అలాగే ముఫాసా సోదరుడు టాకా అనే పాత్రకు సత్యదేవ్ వాయిస్ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకి షారుక్‌ ఖాన్‌ వాయిస్ ఇస్తుండగా ముఫాసా చిన్నప్పటి పాత్రకి షారుక్ తనయుడు అబ్రం వాయిస్‌ ఓవర్ ఇచ్చాడు.