Site icon NTV Telugu

“7 డేస్ 6 నైట్స్” మేజర్ షెడ్యూల్ పూర్తి

MS Raju wrapped up major schedule of 7 Days 6 Nights

ప్రముఖ డైరెక్టర్ ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తున్న కొత్త మూవీ ‘7 డేస్ 6 నైట్స్’. ఈ చిత్రాన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ సమర్పణలో, వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకం మీద సుమంత్ అశ్విన్, రజనీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమంత్ అశ్విన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సుమంత్ అశ్విన్ సరసన హీరోయిన్ గా మెహర్ చావల్ అనే కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు. వీరిద్దరితో పాటు రోహన్, కృతికా శెట్టి మరో జంటగా పరిచయమవుతున్నారు. ఈ నలుగురే కాకుండా సుష్మ, రిషికా బాలి ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపరాజు రమణ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు.

Read Also : శ్రీదేవి సోడా సెంటర్ : ఆగష్టు 17న “చుక్కల మేళం” సాంగ్

జూన్ 21న హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ ప్రారంభించి 22 రోజుల్లో పూర్తి చేశారు. గత నెల 28 నుండి 20 రోజుల పాటు బెంగళూర్, ఉడిపి, గోకర్ణ, గోవాల్లో మలి షెడ్యూల్ స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఎట్టకేలకు ఈ రోజు రెండవ షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు మేకర్స్. గోవాలో భారీ వర్షం, కోవిడ్ యొక్క ప్రతికూల పరిస్థితుల మధ్య ‘7 డేస్ 6 నైట్స్’ ప్రధాన షెడ్యూల్ పూర్తి చేశారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే అప్డేట్స్ ఇవ్వనున్నారు.

Exit mobile version