Site icon NTV Telugu

Mrunal Thakur : హీరోతో ప్రేమలో మృణాల్ ఠాకూర్?

Mrunal Thakur Thumb

Mrunal Thakur Thumb

Mrunal Thakur Reveals her love on a Movie Hero: మృణాల్ ఠాకూర్ సినిమాల పరంగా మాంచి జోష్ మీద ఉన్నది. ఈ మరాఠి ముద్దుగుమ్మ బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ హిందీ సినిమాలతో పాటు ఇటు తెలుగులోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే. ‘సీతారామం’ తర్వాత తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిన ఆమె ఇక్కడ ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా మృణాల్ ఠాకూర్ ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్న ఆమె తన ప్రేమ గురించి. చేసుకోబోయే వాడు ఎలా ఉండాలనే విషయం గురించి చెప్పి హాట్ టాపిక్ అయింది. ఒక తాజాగా ఇంటర్వ్యూలో రిలేషన్ షిప్ పై మృణాల్ కు ప్రశ్న ఎదురవగా మృణాల్ ఆసక్తికరంగా బదులిచ్చింది.

Bhagavath Kesari: భగవంత్ కేసరికి షాకింగ్ బిజినెస్.. ఎన్ని కోట్లకు అమ్ముడు పోయిందంటే?

ఆమె మాట్లాడుతూ హాలీవుడ్ హీరో కీను రీవ్స్ అంటే తనకు చాలా ఇష్టమని, చిన్నప్పుడే అతన్ని చూసి ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చింది. అయితే తనది కేవలం వన్ సైడ్ లవ్ మాత్రమేనని, కీను రీవ్స్ లాంటి వ్యక్తి తన జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తనకి పెళ్లి, రిలేషన్ షిప్ కు సమయం లేదని, పూర్తి టైమ్ కెరీర్ పైనే ఫోకస్ పెట్టి పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది. హిందీ, తెలుగులో వరుసగా ఆఫర్లు అందుకుంటూ వస్తున్న ఆమె టాలీవుడ్ లో నాని సరసస ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండ సరసన VD 13లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే హిందీలో కూడా ఆమె మూడు సినిమాలు చేస్తోంది. ఆమె అక్కడ ప్రస్తుతం ‘ఆంఖ్ మిచోలీ’, ‘పూజా మేరీ జాన్‘, ‘పిప్పా’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Exit mobile version