Mrunal Thakur: డీప్‌ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ ఆగ్రహం.. వెంటనే తొలగించండి, లేదంటే చట్టపరమైన చర్యలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur: సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు అభిమానుల నుంచి ఎంత ప్రేమ పెరుగుతుందో, అదే స్థాయిలో ఆన్లైన్ వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగం సినీ ప్రముఖులకు కొత్త సవాల్‌గా మారుతోంది. తాజాగా ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ కూడా ఇలాంటి ఘటనకు గురికావడంతో మరోసారి డీప్‌ఫేక్ కంటెంట్‌పై చర్చ మొదలైంది. ఇటీవల సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు మృణాల్ ఠాకూర్ మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేశారు. అసభ్యంగా ఉన్న ఆ ఫోటోలు వేగంగా వైరల్ కావడంతో ఈ విషయాన్ని మృణాల్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆ ఫోటోలు మార్ఫింగ్ ఫోటోలని వాటిని షేర్ చేసిన వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ ఫోటోలను మళ్లీ షేర్ చేసినా, వైరల్ చేసినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమనే సంకేతాన్ని ఆమె స్పష్టంగా ఇచ్చారు.
మృణాల్ ఎదుర్కొన్న ఈ పరిస్థితి కొత్తది కాదు. గతంలో రష్మిక మందన్న సహా పలువురు ప్రముఖ నటీమణులు కూడా డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోల బారిన పడ్డారు. ఏఐ టెక్నాలజీతో డెవలప్ అవుతున్నకొద్దీ దాని దుర్వినియోగం కూడా పెరుగుతుండటంతో సినీ పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంఘటనపై మృణాల్ స్పందించినప్పటికీ, వివాదాస్పద పోస్టర్లు మాత్రం ఇంకా చక్కర్లు కొడుతున్నాయనే తెలుస్తోంది. పోలీసులి వాటిని ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఘటన మరోసారి డీప్‌ఫేక్ కంటెంట్ నియంత్రణపై కఠిన చర్యలు అవసరమనే చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా, కెరీర్ పరంగా మృణాల్ ఠాకూర్ మంచి ఫామ్‌లో కొనసాగుతున్నారు. ‘హాయ్ నాన్న’ ‘సీతారామం’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు అల్లు అర్జున్ నటిస్తున్న’రాకా’ చిత్రంలోనూ నటించే అవకాశాలపై జోరుగా ప్రచారం సాగుతోంది.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- Tags
- cinema
- Mrunal Thakur
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!