Site icon NTV Telugu

Mrunal Thakur : అనుష్క శర్మ పై మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్లు

Anushka Sharma, Mrunal

Anushka Sharma, Mrunal

బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా మంచి ఫేమ్ సంపాదించుకున్నప్పటకి.. ప్రజంట్ తన వివాదాస్పద మాటలతో తెగ వార్తల్లో నిలుస్తోంది. ఇటివల బిపాసా బసు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ఆమెను తిట్టిపోశారు. చివరికి బిపాసా కూడా రియాక్ట్ అవుతూ పరోక్షంగా ఆమెపై మండిపడింది. దీంతో మృణాల్ క్షమాపన కూడా చెప్పింది. అయితే తాజాగా ఈ సారి ఏకంగా అనుష్క శర్మను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కొత్త వివాదానికి కారణమయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్..

Also Read : Avatar 2 : మళ్ళీ థియేటర్స్ లోకి ‘అవతార్ 2’.. !

‘బాలీవుడ్‌లో నాకు ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేశా, ఒకవేళ అప్పుడు ఆ సినిమా చేసి ఉంటే ఇప్పుడు ఎన్నో అవకాశాలు కోల్పోయేదాన్ని. ఆ సినిమా సూపర్‌హిట్ కావడంతో ఆ హీరోయిన్‌కి స్టార్‌డమ్ వచ్చింది, ఇప్పుడు ఆమె సినిమాలు చేయడం లేదు’ అని చెప్పుకొచ్చింది. మృణాల్ ఠాకూర్ సినిమా పేరు నేరుగా చెప్పకపోయినా అది సల్మాన్‌ఖాన్, అనుష్క శర్మ నటించిన ‘సుల్తాన్’ గురించే అని నెటిజన్లు వాపోతున్నారు. అంతే కాదు మృణాల్ కామెంట్స్ అనుష్క శర్మని అవమానించేలా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు..

‘‘అనుష్క శర్మ  విరాట్ కోహ్లి లాంటి స్టార్ క్రికెటర్‌ని పెళ్లి చేసుకుని భర్త, పిల్లలంటూ సినిమాలకు దూరమైంది’ ‘నటించాలనుకుంటే ఇప్పటికీ ఆమెకు అవకాశాలు క్యూ కడతాయి’.. ‘నువ్వు మాత్రం డేటింగ్‌లు అంటూ తిరుగుతున్నావంటూ’ అంటూ ధారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తనిని తాను గొప్పగా చెప్పుకోవడానికి ఇతరులను కించపరచాల్సిన అవసరం లేదని విమర్శిస్తున్నారు. మరి తాజా ట్రోలింగ్‌పై మృణాల్ ఠాకూర్ ఎలా స్పందిస్తుందో.. అసలు స్పందిస్తుందో లేదో చూడాలి.

Exit mobile version