Site icon NTV Telugu

Parasuram: ఫ్యామిలీ స్టార్ ఒక ఆణిముత్యం.. చూసిన వాళ్లు మళ్లీ చూడండి!

Svp Director Parasuram Apologises For Hurting Sentiments Of Narasimha Swamys Devotees 001

Svp Director Parasuram Apologises For Hurting Sentiments Of Narasimha Swamys Devotees 001

Parasuram Comments at Family Star Sucess meet: ఫ్యామిలీ స్టార్ సక్సెస్ మీట్ లో దర్శకుడు పరశురామ్ పెట్ల మాట్లాడుతూ ఫ్యామిలీ స్టార్ సినిమా ఇవాళ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, అన్ని వర్గాల ప్రేక్షకులు తమకు సినిమా నచ్చిందంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు అని అన్నారు. నేను ఏ ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే బలంగా నమ్మి కథ రాశానో అవి ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యాయి, ఇదొక ఆణిముత్యం లాంటి సినిమా అని అన్నారు. కుటుంబం బాగుండాలని ఓపికగా కష్టపడే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కు అది బ్రదర్ కావొచ్చు, మదర్ కావొచ్చు, ఫాదర్ కావొచ్చు..వారికి అంకితమిస్తూ ఫ్యామిలీ స్టార్ సినిమా రూపొందించా, చూసిన వాళ్లు మళ్లీ చూడండి, ఇలాంటి మంచి సినిమాను సొసైటీలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా అని అన్నారు.

Dil Raju: మా టార్గెట్ రీచ్ అయ్యాం.. దిల్ రాజు కామెంట్స్ వైరల్

ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉంది, ఆడియెన్స్ తో కలిసి సినిమా చూశా, వాళ్లు ఎమోషనల్ గా ఫీలవుతున్నారు, క్లాప్స్ కొడుతున్నారు, నవ్వుతున్నారు. నేను చేసిన ఇందు, విజయ్ గోవర్ధన్ క్యారెక్టర్స్ తో పాటు బామ్మ, వదిన, పిల్లల క్యారెక్టర్స్ ను వారిలోని ఎమోషన్ ను ఫీలవుతున్నారు. ఇందుగా నేను నా క్యారెక్టర్ కు జస్టిఫికేషన్ చేశానని భావిస్తున్నా, ఇందు గోవర్థన్ రెండూ నువ్వా నేనా అనే లాంటి క్యారెక్టర్స్. నటిగా కొన్నిసార్లు సాఫ్ట్ క్యారెక్టర్స్, కొన్నిసార్లు టఫ్ క్యారెక్టర్స్ చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ స్టార్ లో నటిగా నన్ను కొత్తగా ప్రేక్షకులకు చూపించే అవకాశం వచ్చింది, గత వారం రోజులుగా మీడియా మా సినిమాకు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేం అని అన్నారు.

Exit mobile version