NTV Telugu Site icon

Mrunal Thakur: కంగన రనౌత్‌ ఫ్లాట్స్‌ కొనేసిన మృణాల్‌ ఠాకూర్‌

Mrunal Takur

Mrunal Takur

Mrunal Thakur Purchases Kangana Ranaut’s Properties at Mumbai: ఎమర్జన్సీ సినిమా నిర్మించడానికి కంగన రనౌత్‌ ఆస్తులు అమ్మేసుకుంటోంది. కంగన స్వయంగా డైరెక్ట్‌ చేస్తూ నిర్మిస్తున్న ‘ఎమర్జన్సీపై ఇప్పటివరకు సంపాదించింది అంతా పెట్టేసింది. ఎందుకు అలా చేస్తుంది అందరూ జాలి పడుతున్నారు. అయితే ఆమె అమ్మేసుకుంటున్న ఆస్తులను మృణాల్ కొనుగోలు చేయడం మరింత హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి తెలుగులో సీతారామం హిట్‌ తర్వాత తెలుగులో మృణాల్‌ ఠాకూర్‌ పేరు బాగా వినిపిస్తోంది. డేట్స్‌ ఇవ్వక ఏడ్పించినా ప్రమోషన్స్‌కు రాక ఇబ్బంది పెట్టినా వరుస హిట్స్‌తో లక్కీ హీరోయిన్‌ ముద్ర పడడంతో ఛాన్సులు ఇస్తూనే వున్నారు. రెమ్యునరేషన్‌ 3 కోట్లు అడుగుతున్నా ఈ అమ్మడే కావాలంటున్నారు. సీతా రామం, హాయ్‌ నాన్న హిట్స్‌ తర్వాత విజయ్‌ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’లో నటిస్తూ హ్యాట్రిక్‌పై కన్నేసింది.

నిజానికి 31 ఏళ్ల మృణాల్‌ తన 21వ ఏట ‘ హలో నందన్‌’ అనే మరాఠీ మూవీతో సినిమాల్లోకి వచ్చింది. తెలుగులో ఛాన్స్‌ రావడానికి ఎనిమిదేళ్లు పట్టింది. లేటైతే అయింది కానీ.. లేటెస్ట్‌ క్రేజ్‌ అంతా ఈ అమ్మడిదే. సీతారామంలో నటిస్తే కోటి కూడా ఇవ్వలేదట. డెబ్యూ మూవీ హిట్ కావడంతో 2 కోట్లకు వెళ్ళిపోయింది. హాయ్‌నాన్న సక్సెస్‌తో ప్రస్తుతం 3 కోట్లకు పైగా డిమాండ్‌ చేస్తోంది మృణాల్. ఇక ఫ్యామిలీ స్టార్‌ ఏప్రిల్‌ 5న థియేటర్స్‌లోకి వస్తుంటే మృణాల్‌ మరో రెండు సినిమాలకు సైన్‌ చేసిందిట. ఇలా తెలుగులో సంపాదించింది అంతా ముంబాయికి తీసుకెళ్లి రెండు ప్లాట్లు కొనేసింది. అంధేరిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పక్కపక్కనే వున్న కంగన తండ్రి, బ్రదర్‌ ఫ్లాట్లను చెరో ఐదు కోట్లు ఇచ్చి కొనేసిందట. ఆల్రెడీ రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తికాగా ప్రస్తుతం రెన్నోవేషన్‌ చేయిస్తోంది మృణాల్‌.

అయితే సినిమా హిట్టయినా.. ఫ్లాప్‌ అయినా.. కంగన రనౌత్‌ కాస్ట్‌ లీ హీరోయిన్నే. రెమ్యునరేషన్‌ విషయంలో తగ్గేదే లేదంటుంది. ఈమధ్య సరైన హిట్‌ లేకపోవడం, ఆఫర్స్ తగ్గడంతో మెగాఫోన్‌ పట్టి ‘ఎమర్జెన్సీ’ మూవీ తీసింది. ఇందులో ఇందిరా గాంధీగా నటిస్తూ కాంట్రవర్సీ సబ్జెక్ట్‌ను డీల్‌ చేస్తోంది కంగన. ఈ సినిమాకు తనే నిర్మాత కావడంతో ఆస్తులు అమ్మి సినిమా తీసింది. ఈ క్రమంలో మరోసారి ఫాదర్‌, బ్రదర్‌ పేర్ల మీదున్న రెండు ఫ్లాటులను 10 కోట్లకు అమ్మేయడంతో ఫుల్‌ స్వింగ్లో వున్న మృణాల్‌ కొనేసింది. అయితే ఆస్తులు అమ్ముకుని ఎమర్జెన్సీ తీయడం వెనకాల పెద్ద ప్లానే వుంది. ఎమర్జెన్సీ పాలన ఇందిరాగాంధీకి మాయని మచ్చగా నిలిచింది. కంగనా ఇందిరా గాంధీగా నటించి సాహసమే చేసింది. బిజెపి సపోర్టర్‌ అయిన కంగన కమలాన్ని వికసింపజేయడానికి ఇదంతా చేస్తోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎప్పటికైనా.. సొంత రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అవాలన్న లక్ష్యంగా ఆస్తులమ్మి ఎమర్జెన్సీ తీస్తోందని నార్త్ వర్గాల్లో ప్రచారమైతే ఉంది. అందులో నిజానిజాలు ఎంత ఉన్నాయో కానీ.