NTV Telugu Site icon

Mrunal Thakur: అయ్యో.. సీతా.. నువ్వు మా గుండెలను ముక్కలు చేసేశావ్

Mrunal

Mrunal

Mrunal Thakur: ప్రేక్షకులు.. చాలా అంటే చాలా మంచివారు. ముఖ్యంగా తెలుగువారు. ఒక సినిమా కానీ, అందులో చేసిన హీరోహీరోయిన్లు కానీ నచ్చరు అంటే.. వారిని గుండెల్లో పెట్టుకుంటారు. వారు బయట వేరేవిధంగా ఉన్నా ఓర్చుకోలేరు. ఆ సినిమాలో ఉన్నట్లే కనిపించాలని కోరుకుంటారు. నిజం చెప్పాలంటే రియల్ వేరు, రీల్ వేరు. అయినా చాలామాండీ తమకు నచ్చిన పాత్రలోనే ఊహించేసుకుంటూ ఉంటారు. అలా లేకపోతే విమర్శించడం మొదలుపెడతారు. సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. సీతగా అందరి మనస్సులో తిష్టవేసుకొని కూర్చుంది. ఆమె ఎక్కడికి వెళ్లినా మృణాల్ అని పిలవడం కన్నా సీతా.. సీతా అని పిలవడం ఎక్కువ అయిపోయింది.

Poorna: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ‘దసరా’ బ్యూటీ.. ఎవరో తెలుసా..?

ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో మృణాల్ ఎలాంటి మోడ్రన్ డ్రెస్ వేసుకున్నా అభిమానులు ఏకిపారేశారు. సీతా.. ఇలాంటి డ్రెస్ లు వేసుకోకు అంటూ కామెంట్స్ పెట్టారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి దగ్గరదగ్గర ఏడాది కూడా కావొస్తుంది.. అయినా అభిమానులు మాత్రం సీతను వదిలిపెట్టలేదు. ఆమె ఎలాంటి డ్రెస్ వేసుకున్నా సీతగానే చేస్తున్నారు. మొదటి నుంచి మృణాల్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. బికినీలతో బెంబేలెత్తించిన రోజులు కూడా ఉన్నాయి. సీతారామం తరువాత ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇక తాజాగా మరోసారి బికినీతో ముద్దుగుమ్మ రచ్చ చేసింది. బీచ్ ఒడ్డున బ్లూ బికినీలో మృణాల్ అందాల జాతర మాములుగా లేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన సీత అభిమానులు.. అయ్యా.. సీతా.. నువ్వు మా గుండెలను ముక్కలు చేసేశావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం మృణాల్ తెలుగులో నాని సరసన నాని30 లో నటిస్తోంది. మరి ఈ సినిమాతో ఈ అమ్మడు ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Show comments