NTV Telugu Site icon

Mrunal Thakur : మరో బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాకూర్

Untitled Design (11)

Untitled Design (11)

మంచి ఫేమ్ అండ్ మార్కెట్ అందుకోవడం అనేది హీరోయిన్స్‌కి అంత సాధ్యం కాదని చెప్పాలి. అందులోను హీరోయిన్ ల కెరీర్ ఇండస్ట్రీలో చాలా తక్కువ కాలం ఉంటుంది. కాగా కొందరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నేళ్లలోనో, లేదా రెండు మూడు సినిమాల తర్వాతనో వారి కెరీర్ కి బ్రేక్ . కానీ ఇంకొందరు మాత్రం జస్ట్ ఒక సినిమాతోనే మంచి ఆదరణ అందుకుని. జనాలకు చాలా దగ్గరైపొతారు. అలాంటి హీరోయిన్స్‌లో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు.

కెరీర్ ఆరంభంలో బాలీవుడ్ సినిమాలో చాలా చిన్న చిన్న పాత్రలు, సీరియల్స్ చేసుకుంటూ ఉండేది మృణాల్. అక్కడ నుంచి మన తెలుగు సినిమాలోకి ‘సీతారామం’ తో ఎంట్రీ ఇచ్చి సీత గా చెరగని ముద్ర వేసుకుంది. తన అందంతో హోమ్లీగా కనిపించినప్పటికి, తదుపరి చిత్రాలల్లో తనలోని హాట్ యాంగిల్ ని కూడా చూపించింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో వరుస ప్రాజెక్ట్ లు ఉన్నాయి.అయితే తాజాగా మృణాల్ మరో బిగ్ ఆఫర్ ని పట్టేసినట్టుగా సినీ వర్గాల్లో టాక్. అది కూడా హిందీలో ఓ క్రేజీ సీక్వెల్ లో నటిస్తోందట. ఇంతకి ఏంటా మూవీ అంటే.

2012 లో అజయ్ దేవగన్ హీరోగా చేసిన ‘సన్నాఫ్ సర్దార్’ మూవీ అంత చూసే ఉంటారు. ఇది ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాకి రీమేక్ గా హిందీలో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకి తెలుగులో ఎలాంటి సీక్వెల్ లేనప్పటికీ హిందీలో మాత్రం సీక్వెల్‌ని ప్రకటించారు. కాగా ఇందులో మృణాల్ హీరోయిన్ గా ఆఫర్ అనుకున్నట్టుగా బాలీవుడ్ వర్గాల సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ప్రజంట్ మృణాల్ తెలుగులో అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ అనే సినిమా చేస్తుండగా, హిందీలో కూడా బిజీగా మారింది.