NTV Telugu Site icon

Mr. Bachchan: బచ్చన్ సర్.. మొదలుపెట్టారు

Ravi

Ravi

Mr. Bachchan: మాస్ మహారాజా రవితేజ.. సినిమాలు విజయాపజయాలను పక్కన పెట్టేసి వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే ఈగల్ తో సంక్రంతి రేసులోకి దిగుతున్నాడు. ఇంకోపక్క మరో కొత్త చిత్రాన్ని సెట్ మీదకు తీసుకెళ్లిపోయాడు. హరీష్ శంకర్- రవితేజ కాంబోలో వస్తున్న చిత్రం మిస్టర్‌ బచ్చన్‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ మూవీ ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్‌ అమితాబ్‌ పోజ్‌లో కనిపిస్తూ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నేడు సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ విషయాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

రవితేజ ముఖంపై క్లాప్ బోర్డు ను చూపిస్తూ.. ఇది ఇప్పుడే మొదలైంది అని రాసుకొచ్చాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ కాంబోలో మిరపకాయ్, షాక్ సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి వీరూ కొత్త కథతో రాబోతున్నారు. నిజం చెప్పాలంటే హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమాతో బిజీగా ఉండాలి. కానీ, పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆ సినిమా సగంలోనే ఆగిపోయింది. ఏపీ ఎలక్షన్స్ అయ్యాకా కానీ, పవన్ మళ్లీ సెట్ లో అడుగుపెట్టడు. ఈలోపు హరీష్, రవితేజతో మిస్టర్ బచ్చన్ ను పూర్తిచేయనున్నాడు. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Show comments