Mr. Bachchan: బచ్చన్ సర్.. మొదలుపెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mr. Bachchan: మాస్ మహారాజా రవితేజ.. సినిమాలు విజయాపజయాలను పక్కన పెట్టేసి వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే ఈగల్ తో సంక్రంతి రేసులోకి దిగుతున్నాడు. ఇంకోపక్క మరో కొత్త చిత్రాన్ని సెట్ మీదకు తీసుకెళ్లిపోయాడు. హరీష్ శంకర్- రవితేజ కాంబోలో వస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ మూవీ ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్‌లో కనిపిస్తూ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నేడు సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ విషయాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
రవితేజ ముఖంపై క్లాప్ బోర్డు ను చూపిస్తూ.. ఇది ఇప్పుడే మొదలైంది అని రాసుకొచ్చాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ కాంబోలో మిరపకాయ్, షాక్ సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి వీరూ కొత్త కథతో రాబోతున్నారు. నిజం చెప్పాలంటే హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమాతో బిజీగా ఉండాలి. కానీ, పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆ సినిమా సగంలోనే ఆగిపోయింది. ఏపీ ఎలక్షన్స్ అయ్యాకా కానీ, పవన్ మళ్లీ సెట్ లో అడుగుపెట్టడు. ఈలోపు హరీష్, రవితేజతో మిస్టర్ బచ్చన్ ను పూర్తిచేయనున్నాడు. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.
Also Read
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
It..just started …… #MrBachan @RaviTeja_offl @vishwaprasadtg @vivekkuchibotla @DoP_Bose @peoplemediafcy pic.twitter.com/vlhi8EY2ub
— Harish Shankar .S (@harish2you) December 28, 2023
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!