Site icon NTV Telugu

“సర్కారు వారి పాట”లో కాంగ్రెస్ ఎంపీ

MP Shashi Tharoor Met Mahesh Babu along with MP Galla Jayadev

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. ఈ సినిమా లొకేషన్‌లోకి నిన్న ఒక ప్రత్యేక అతిథి విచ్చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్, మహేష్ బాబు బావమరిది జయదేవ్ గల్లాతో కలిసి “సర్కారు వారి పాట” షూటింగ్ సెట్లో మహేష్ ను కలిశారు. శశి థరూర్ కేరళలోని తిరువనంతపురం నుంచి ఎంపీగా ఉన్నారు. జయదేవ్ పార్లమెంటులో గుంటూరు లోక్ సభ సెగ్మెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి (టిడిపి) చెందినవారు. ఈ పార్లమెంట్ సహచరులు మహేష్ బాబును కలవడానికి డైరెక్ట్ గా షూటింగ్ సెట్ కు వచ్చారు.

Read Also : మూడో రోజు వినోదం తక్కువ… విషాదం ఎక్కువ!

“సర్కారు వారి పాట” బృందం, మహేష్ బాబు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శశి థరూర్ సూపర్ స్టార్‌తో కరచాలనం చేస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి భేటీకి సంబంధించిన వీడియోను శశి థరూర్ పోస్ట్ చేసారు. ఆసక్తికరమైన సందేశాన్ని వ్రాశారు. “ఆయనను హైదరాబాద్ లో అంతా సూపర్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో అర్థమైంది. హైదరాబాద్‌లోని మా ట్రైటెల్‌హైడ్‌లోని హోటల్‌లో నేను నా సహోద్యోగి గల్లా జయదేవ్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిశాను. ఎంత మనోహరమైన వ్యక్తిత్వం! ” అని ఆయన ట్వీట్ చేశారు.

Exit mobile version