NTV Telugu Site icon

Movies Releasing: మూవీ లవర్స్ కి పండుగే.. రెండు రోజుల్లో 15 సినిమాలు

Skanda Day 1 Chandramukhi 2 Day 1

Skanda Day 1 Chandramukhi 2 Day 1

Movies Releasing this weak india wide: ఈవారం లాంగ్ వీకెండ్ రావడంతో అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు వరుస సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో హాలీడే జోష్ ను క్యాష్ చేసుకోవడానికి తెలుగులో మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. రామ్ బోయాపాటి ల ‘స్కంద’ మూవీ, లారెన్స్ ‘చంద్రముఖి 2’ సినిమాలను లెక్క చేయకుండా శ్రీకాంత్ అడ్డాల తీసిన ‘పెదకాపు 1’ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీపై కూడా అంచనాలు ఉన్నాయి. ఈ వీకెండ్ తెలుగు సినిమాలకు పోటీ ఇస్తూ బాలీవుడ్ నుంచి ‘ఫక్రే 3’, ‘ది వ్యాక్సిన్ వార్’, డిస్నీ+హాట్ స్టార్ లో తుమ్సే నా హో పాయేగా, ద్వంద్ – ది ఇంటర్నల్ కాంఫ్లిక్ట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అదే సమయంలో సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న చిత్తా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బానదారియల్లి, తోతాపురి, కాంత్రి వీర అనే సినిమాలు కన్నడలో రిలీజ్ అవుతున్నాయి. ఇక మలయాళంలో 8 సినిమా రిలీజ్ అవుతుండగా మరాఠీలో ససుబాయ్ జారత్ బెంగాలీ నుంచి తారొకర్ మ్రిత్యు రిలీజ్ అవుతున్నాయి. గుజరాతీ నుంచి లయ బకి, నిక్కీ, హు చు మిస్టర్, శంకర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

Chandramukhi 2 Review: చంద్రముఖి 2 రివ్యూ

ఇక ఈ వారం ఓటీటీలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో కలిపి వివిధ భాషలకు చెందిన 24 సినిమాలు విడుదలవుతున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌: 1. లిటిల్‌ బేబీ బమ్‌: మ్యూజిక్‌ టైమ్‌(ఇంగ్లీష్‌ సిరీస్‌), 2. ద డెవిల్స్‌ ప్లాన్‌ (కొరియన్‌ సిరీస్‌), 3. ఓవర్‌హౌల్‌ (పోర్చుగీస్‌ మూవీ), 4. స్వీట్‌ ఫ్లో 2 (ఫ్రెంచ్‌ చిత్రం), 5. ద వండర్‌ఫుల్‌ స్టోరీ ఆఫ్‌ హెన్రీ షుగర్‌ (ఇంగ్లీష్‌ సినిమా), 6. ఐస్‌ కోల్డ్‌: మర్డర్‌, కాఫీ అండ్‌ జెస్సీకా వాంగ్సో (ఇంగ్లీష్‌ మూవీ), 7. లవ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్‌, 8. ఫెయిర్‌ ప్లే, 9. చూనా (హిందీ సిరీస్‌), 10. నో వేర్‌ (స్పానిష్‌ సినిమా), 11. రెప్టైల్‌ (ఇంగ్లీష్‌ మూవీ), 12. ఖుషి (తెలుగు సినిమా), 13. స్పైడర్‌మ్యాన్‌: ఎక్రాస్‌ ద స్పైడర్‌-వర్స్‌ (ఇంగ్లీష్‌ సినిమా) అమెజాన్‌ ప్రైమ్‌: 14. హాస్టల్‌ డేజ్‌ సీజన్‌ 4 (హిందీ సిరీస్‌), 15. కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్‌), 16. డోబుల్‌ డిస్కోర్షో (స్పానిష్‌ చిత్రం) హాట్‌స్టార్‌: 17. కింగ్‌ ఆఫ్‌ కొత్త (తెలుగు డబ్బింగ్‌ సినిమా), 18. లాంచ్‌ ప్యాడ్‌ సీజన్‌ 2 (ఇంగ్లీష్‌ సిరీస్‌), 19. తుమ్‌ సే నా హో పాయేగా (హిందీ సినిమా) ఆహా: 20. పాపం పసివాడు (తెలుగు సిరీస్‌), 21. డర్టీ హరి (తమిళ చిత్రం) సోనీ లివ్‌: 22. చార్లీ చోప్రా (హిందీ సిరీస్‌), 23. ఏజెంట్‌ (తెలుగు మూవీ), 24. అడిjైు! (తమిళ సినిమా)