NTV Telugu Site icon

ఆసక్తికరంగా ‘విజయ్ సేతుపతి’ ట్రైలర్

Vijay Sethupathi Telugu Movie Trailer

విజయ్ చందర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, నివేదా పెతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘సంగతమీజన్ ’. గతేడాది నవంబర్ 15న ఏ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ తంబీలను విశేషంగా ఆకట్టుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ తెలుగులో ‘విజయ్ సేతుపతి’ టైటిల్ తో విడుదలైంది. వివేక్ మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను హర్షిత మూవీస్ బ్యానర్ అధినేత రావూరి వి శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ‘విజయ్ సేతుపతి’ చిత్రం తాజాగా తెలుగు ఓటిటి వేదికపై విడుదలకు సిద్ధంగా ఉంది. ఆహాలో మే 14న ‘విజయ్ సేతుపతి’ ప్రీమియర్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ లోని డైలాగులు, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఆసక్తికరంగా సాగిన ‘విజయ్ సేతుపతి’ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.