Site icon NTV Telugu

ఆసక్తికర యాక్షన్ థ్రిల్లర్ ‘కాలా’ ట్రైలర్

Tovino Thomas KALA Trailer is out now

టొవినో థామస్, సుమేశ్ మూర్ ప్రధాన పాత్రలు పోషించిన అవెయిటెడ్ యాక్షన్ డ్రామా ‘కాలా’ జూన్ 4న ఆహాలో విడుదల కానుంది. ఈ యేడాది మార్చి 25న ‘కాలా’ చిత్రం థియేటర్లలో విడుదలైంది. సాధారణ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఓ హింసాత్మక ఘటనలో చనిపోయిన కుక్క కారణంగా ఇద్దరు వ్యక్తుల నడుమ సాగే భావోద్వేగ సంఘటనల సమాహారమే ‘కాలా’. ఓ కుక్క కారణంగా మొదలైన వివాదం చినికి చినికి గాలీవానగా మారుతుంది. ప్రారంభం నుండి ముగింపు వరకూ నాన్ స్టాప్ యాక్షన్ తో మూవీ సాగుతుంది. ఫారెస్ట్ హౌస్ లో ఒక రోజులో జరిగే కథ ఇది. టొవినో థామస్ తో పాటు సుమేష్ మూర్, దివ్యా పిళ్ళై, లాల్ పాల్, ప్రమోద్ వెల్లియానంద్ ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రోహిత్ వి.ఎస్. దర్శకత్వం వహించాడు. గతంలో ‘ఆహా’లో ప్రసారమైన ‘మూతాన్, జల్లికట్టు, మిడ్ నైట్ మర్డర్స్, వ్యూహం, నిఫా వైరస్, షైలక్’ తరహాలోనే ‘కాలా’కు వీక్షకుల ఆదరణ లభిస్తుందనే ఆశాభావాన్ని నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ‘కాలా’ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. “మనిషిలోని మృగం మేల్కొంటే, నాగరికత కూడా చిన్నబోతుంది. ఇది అలాంటి ఒక కథ!” అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Exit mobile version