ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సినిమా బండి’. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ట్రైలర్ హానెస్ట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటూనే నవ్వులు కురిపిస్తోందంటూ సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, సందీప్ కిషన్, మనోజ్ బాజ్పాయి తదితరులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ‘సినిమా బండి’ ట్రైలర్ విషయానికొస్తే… ఈ చిత్రం ఆటో రిక్షా డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. ఆటో డ్రైవర్ కు తన ఆటో వెనుక సీట్లో కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో తన స్నేహితుడితో కలిసి, అతను తన గ్రామ పరిస్థితిని మెరుగుపరిచేందుకు మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు, డైలాగులు నవ్వులు కురిపిస్తున్నాయి. చిత్ర నిర్మాతలు రాజ్, డికె ద్వయం. వసంత మారింగటి రాసిన ఈ స్టోరీలైన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
‘సినిమా బండి’ ట్రైలర్ పై ప్రశంసల వర్షం
