NTV Telugu Site icon

Narudi Brathuku Natana : రోలర్‌కోస్టర్ రైడ్‌‌గా ‘నరుడి బ్రతుకు నటన’ ట్రైలర్

Narudi Brathuku Natana Trai

Narudi Brathuku Natana Trai

Narudi Brathuku Natana Trailer launched: శివ కుమార్ రామచంద్ర వరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నరుడి బ్రతుకు నటన అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వదిలిన కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతున్న ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టిజి విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా థియెట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఈరోజు రిలీజ్ చేశారు.

Vishwambhara : మెగా ఫాన్స్ కి దసరా బొనాంజా.. గెట్ రెడీ

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసి.. యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు. ఈ ట్రైలర్ చూస్తే శివ కుమార్ నటుడు అవ్వాలని ఆడిషన్స్ ఇస్తూ ఫెయిల్ అయ్యే సీన్ తో ఓపెన్ అవుతోంది. అందరూ అతన్ని నిరుత్సాహ పరుస్తూ ఉంటారు. జీవితం అంటే ఏంటో తెలిస్తేనే.. నటన తెలుస్తుందని చెప్పడంతో.. ఓ తెలియని ఊరికి వెళ్తాడు. అలా కథ హైదరాబాద్ నుంచి కేరళకు షిఫ్ట్ అవుతుంది. ట్రైలర్ లో చూపించిన కేరళ అందాలు, సినిమాలో ఎమోషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. హాస్యం, ప్రేమ, ఎమోషన్ ఇలా అన్ని రకాల అంశాలు జోడించి ఈ చిత్రాన్ని తీశారని ట్రైలర్ చెబుతోంది.

శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్ తమ పాత్రలను సమర్ధవంతంగా పోషించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ప్రత్యేకమైన స్క్రిప్ట్‌ని ఎంచుకున్న రిషికేశ్వర్ యోగి దానిని ఆకర్షణీయంగా మలిచారనిపిస్తోంది. డైలాగ్స్ ఎమోషనల్‌గా ఉన్నాయి. ఫహద్ అబ్దుల్ మజీద్ కేరళలోని ప్రకృతి దృశ్యాలను చాలా అద్భుతంగా చిత్రీకరించారు. NYX లోపెజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్‌ను మరింతగా పెంచేసింది. అక్టోబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ సినిమాకి ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.

Show comments